Layoffs at Intel : టెక్ దిగ్గజం ఇంటెల్ లో ఉద్యోగుల తొలగింపు

Layoffs at Intel : టెక్ దిగ్గజం ఇంటెల్ లో ఉద్యోగుల తొలగింపు
X

ప్రముఖ టెక్ కంపెనీ ఇంటెల్ పెద్ద సంఖ్యలో ఉద్యోగులను తొలగించనుంది. ఈ వారంలోనే దీనిపై కంపెనీ నిర్ణయం ప్రకటించవచ్చు. ఖర్చు తగ్గించుకోవడంతో పాటు మార్కెట్ వాటాను పెంచుకునేందుకు ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లు బ్లూమ్బర్గ్ తెలిపింది.

ఇంటెల్ సాంకేతికతను మరింత మెరుగుపరచడానికి సమీ కండక్టర్ పరిశ్రమలో కంపెనీని అగ్రగామిగా నిలిపేందుకు చేయాల్సిన పరిశోధన, అభివృద్ధిపై భారీ ఖర్చు చేయాలని కంపెనీ దృష్టిసారించినట్లు స్పష్టమవుతోంది. ఇందులో భాగంగా ఉద్యోగులను తొలగించాలని నిర్ణయించింది. అడ్వాన్స్ డ్ డివైజ్ లు తయారు చేసే ప్రత్యర్థి కంపెనీలు ఈ రంగంలో మార్కెట్ వాటాను పెంచుకుంటున్నాయి. ఎన్విడియా వంటి చిమ్మేకర్ కంపెనీలు సెమీకండక్టర్ ల అభివృద్ధిలో ముందంజలో ఉన్నాయి. దీంతో ఇంటెల్ తన మార్కెట్ వాటాను పెంచుకునేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేయనుంది.

అందులో భాగంగానే సెమీకండక్టర్లను తయారు చేయడానికి వ్యాబ్ గెల్సింగర్ ఫ్యాక్టరీలను నిర్మించాలని ప్లాన్ చేస్తోంది. వ్యయ నియంత్రణ చర్యల్లో భాగంగా ఇంటెల్ 2028లో తన శ్రామిక శక్తికి 5 శాతం తగ్గించుకుంది. భారత్లో హైదరాబాద్, బెంగళూర్లో ఇంటెల్లో 19 వేల మంది ఉద్యోగులు ఉన్నారు.

Tags

Next Story