TG : ఇంటర్ ఎగ్జామ్ ఫీజు గడువు పెంపు

TG : ఇంటర్ ఎగ్జామ్ ఫీజు గడువు పెంపు
X

నేటితో ముగియనున్న ఇంటర్ పబ్లిక్ పరీక్షల ఫీజు చెల్లింపు గడువును తెలంగాణ ఇంటర్ బోర్డు పొడిగించింది. డిసెంబర్ 3 వరకు ఎలాంటి ఫైన్ లేకుండా చెల్లించవచ్చని అధికారులు వెల్లడించారు. రూ.100 అదనపు ఫీజుతో డిసెంబర్ 4-10, రూ.500తో డిసెంబర్ 11-17, రూ.వెయ్యితో డిసెంబర్ 18-24, రూ.2వేలతో డిసెంబర్ 25 నుంచి జనవరి 2 వరకు చెల్లించవచ్చని తెలిపారు.

డిసెంబర్ 15, 16న జరిగే గ్రూప్-2 ఎగ్జామ్స్‌లో ఎలాంటి మార్పు లేదని టీజీపీఎస్సీ అధికారులు స్పష్టం చేశారు. పరీక్షలు యథాతథంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు. డిసెంబర్ 16న జరిగే RRB పరీక్షను రాష్ట్రం నుంచి డిప్లొమా, ఐటీఐ అర్హత ఉన్న 6,300 మంది రాస్తున్నట్లు పేర్కొన్నారు. దీంతో గ్రూప్-2 పరీక్షకు ఎలాంటి ఆటంకం ఉండబోదని వివరించారు.

Tags

Next Story