TS Polycet 2024 - మంచి ఫ్యూచర్ కు మెరుగైన మార్గం.. పాలిసెట్ నోటిఫికేషన్ వచ్చేసింది

తెలంగాణలో పాలిసెట్ (Polycet) - 2024 నోటిఫికేషన్ విడుదలైంది. టెన్త్ విద్యార్హతతతో టెక్నికల్ విద్య కోర్సుల్లో ప్రవేశాలకు అవకాశం కల్పించే పాలిటెక్నిక్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్‌ని నిర్వహిస్తారు. ఇంజినీరింగ్, నాన్ ఇంజినీరింగ్, డిప్లమా, ఉద్యానవన, వ్యవసాయ, పశుసంవర్ధక, మత్స్య కోర్సుల్లో చేరాలంటే ఇందులో అర్హత సాధించడం తప్పనిసరి.
మే 17న పరీక్ష నిర్వహిస్తామని తెలంగాణ రాష్ట్ర సాంకేతిక విద్యా మండలి తెలిపింది. నేటి నుంచి ఆన్‌లైన్‌లో దరఖాస్తుల స్వీకరణ ఉంటుంది. ఫిబ్రవరి 15 నుంచి ఏప్రిల్ 22 వరకు ఫైన్ లేకుండా అప్లై చేసుకోవచ్చు. రూ.100 ఫైన్‌తో ఏప్రిల్ 24 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. పాలిటెక్నిక్ కాలేజీల్లో నిర్వహిస్తున్న పలు కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే ఎంట్రన్స్ పరీక్షకు దరఖాస్తులు తీసుకుంటారు.
ఫీజు వివరాలు
ఎస్సీ, ఎస్టీలకు రూ.250, ఇతరులకు రూ.500గా నిర్ణయించారు. పరీక్ష జరిగిన 12 రోజుల్లో ఫలితాలు వెల్లడి అవుతాయి. పూర్తి వివరాలకు పాలిటెక్నిక్ వెబ్ సైట్ www.polycet.sbtet.telangana.gov.in లో చూడొచ్చు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com