UAN Aadhaar Link : ఇంటి నుంచే నిమిషాల్లో పీఎఫ్-ఆధార్ లింకింగ్.. ఉద్యోగులకు ఈపీఎఫ్ఓ అదిరిపోయే టిప్స్.

UAN Aadhaar Link : ఇంటి నుంచే నిమిషాల్లో పీఎఫ్-ఆధార్ లింకింగ్.. ఉద్యోగులకు ఈపీఎఫ్ఓ అదిరిపోయే టిప్స్.
X

UAN Aadhaar Link : చాలామంది ఉద్యోగులు తమ పీఎఫ్ ఖాతా గురించి పెద్దగా పట్టించుకోరు. కానీ ఏదైనా అత్యవసరమై డబ్బులు విత్ డ్రా చేసుకోవాలన్నా లేదా పాత కంపెనీ నుంచి కొత్త కంపెనీకి పీఎఫ్ బదిలీ చేయాలన్నా అప్పుడు అసలు కష్టాలు మొదలవుతాయి. మీ యూఏఎన్ నంబర్‌తో ఆధార్ లింక్ కాకపోతే, మీ ట్రాన్సాక్షన్లు అన్నీ మధ్యలోనే ఆగిపోతాయి. అందుకే చివరి నిమిషంలో టెన్షన్ పడకుండా ఇంటి నుంచే నిమిషాల్లో ఈ పని ఎలా పూర్తి చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.

ఆధార్ లింక్ చేసే ముందు మీరు ఒక ముఖ్యమైన విషయం గమనించాలి. మీ ఈపీఎఫ్ఓ ప్రొఫైల్‌లో ఉన్న పేరు, పుట్టిన తేదీ.. ఆధార్ కార్డులో ఉన్న వివరాలతో కచ్చితంగా సరిపోవాలి. పేరులో అక్షరం పొరపాటు ఉన్నా, ఇంటి పేరులో తేడాలున్నా వెరిఫికేషన్ ఆగిపోతుంది. అలాగే, మీ ఆధార్‌తో లింక్ అయిన మొబైల్ నంబర్ యాక్టివ్‌గా ఉందో లేదో చూసుకోండి. ఎందుకంటే ఓటీపీ రాకపోతే ప్రక్రియ ముందుకు సాగదు.

ముందుగా EPFO మెంబర్ పోర్టల్‌లోకి వెళ్లి మీ యూఏఎన్ నంబర్, పాస్‌వర్డ్‌తో లాగిన్ అవ్వండి. అక్కడ మేనేజ్ సెక్షన్‌లోకి వెళ్లి కేవైసీ ఆప్షన్‌ను ఎంచుకోండి. అక్కడ ఆధార్ కార్డు వివరాలు ముందే వెరిఫై అయ్యి ఉన్నాయో లేదో చూడండి. ఒకవేళ ఆధార్ లింక్ కాకపోతే, ఆధార్‌ను ఎంచుకుని మీ నంబర్, పేరును సరిగ్గా నమోదు చేసి సేవ్ చేయండి. అయితే ఇక్కడే ఒక మెలిక ఉంది. మీరు వివరాలు ఎంటర్ చేసిన తర్వాత మీ కంపెనీ దానిని ఆమోదించాల్సి ఉంటుంది. ఒకట్రెండు రోజులు దాటినా పెండింగ్‌లో ఉంటే మీ ఆఫీస్ హెచ్ఆర్ లేదా అకౌంట్స్ విభాగాన్ని సంప్రదించి అప్రూవ్ చేయమని అడగండి.

చాలా సార్లు ఆధార్ లింక్ అవ్వకపోవడానికి ప్రధాన కారణం పేరులో ఉండే తప్పులే. కాబట్టి ముందుగా పీఎఫ్ ఖాతాలో వివరాలు సరిదిద్దుకున్నాకే ఆధార్ లింక్ చేయడానికి ప్రయత్నించండి. ఒకసారి ఆధార్ లింక్ అయిపోతే, మీ పీఎఫ్ క్లెయిమ్స్ చాలా వేగంగా సెటిల్ అవుతాయి. పాస్‌బుక్ చూసుకోవడం సులభమవుతుంది. భవిష్యత్తులో మీ రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఎలాంటి ఆటంకం లేకుండా పొందవచ్చు. 2026 నాటికి ఈపీఎఫ్ఓ తన సేవలను మరింత వేగవంతం చేసిన తరుణంలో, ఈ చిన్న పని పూర్తి చేసుకుంటే మీ ఆర్థిక భద్రతకు డోకా ఉండదు.

Tags

Next Story