Microsoft : మైక్రోసాఫ్ట్‌ను వీడుతున్న మహిళా ఉద్యోగులు

సాఫ్ట్‌వేర్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ ఉద్యోగుల్లో వైవిధ్యాన్ని కాపాడేందుకు అవస్థలు పడుతోంది. ఆ సంస్థకు రాజీనామా చేసి వెళ్లిపోయే వారిలో కొన్నివర్గాల సంఖ్య పెరుగుతున్నట్లు గుర్తించింది. ముఖ్యంగా మహిళలు, నల్లజాతీయులు, లాటినిక్స్‌లు కంపెనీని వీడటం ఎక్కువైంది. కంపెనీకి చెందిన డైవర్సిటీ అండ్ ఇంక్లూజన్ రిపోర్టు బుధవారం విడుదలైంది. దీనిలో ఈ విషయాలు బయటపడ్డాయి. వీటిల్లో స్వచ్ఛంద రాజీనామాలు, కంపెనీ నుంచి తొలగింపులు ఉన్నాయి. ఈ ఏడాది జూన్‌తో ముగిసిన ఆర్థిక సంవత్సరంలో మొత్తం రాజీనామాల్లో 32.7% మహిళలే ఉన్నట్లు తేలింది. గతేడాది 31%తో పోలిస్తే ఇది స్వల్పంగా పెరిగింది. నల్లజాతీయుల రాజీనామాలు 8.7% నుంచి 10%కు, లాటినిక్స్ 8% నుంచి 9.8%కు పెరిగినట్లు తేలింది. ప్రత్యర్థి సంస్థలు తమ ఉద్యోగులను లాక్కోవడం, ఆన్‌లైన్ రిటైల్ వ్యాపారంలోకి మారడం వంటి కారణాలుగా భావిస్తోంది..
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com