కరోనా ప్రభావం వీరిపై ఎక్కువ

corona effect on cancer patients
corona, cancer, patients,
కరోనా మహమ్మారి ప్రపంచాన్ని గడగడలాడిస్తుంది. ఈ వైరస్ వ్యాప్తి, ఏ వయసు వారి ఎక్కువ ప్రభావం చూపిస్తుందనే దానిపై అనేక పరిశోధనలు జరుగుతున్నాయి. అయితే, పిల్లలు, వృద్దులు, గుండెజబ్బులు, ఊపిరితిత్తుల సమస్యలు ఉన్నవారికి ఈ మహమ్మారి ప్రమాదకారిగా మారే అవకాశం ఉందని ఈ అధ్యయనాల్లో తేలింది. అయితే తాజాగా.. లండన్ పరిశోధకులు చేసిన అధ్యయనంలో బ్లడ్, బోన్ మ్యారో, ల్యుకేమియా క్యాన్సర్లతో బాధపడేవారిపై ఈ మహమ్మారి ప్రభావం 60శాతం కంటే ఎక్కువగా ఉందని తేలింది. బర్మింగ్‌హామ్ విశ్వవిద్యాలయంలోని పరిశోధకులు మార్చి 18, 2020 నుంచి మే 8, 2020 మధ్యకాలంలో 1,044 మంది క్యాన్సర్‌రోగులను పరిశీలించారు. ఈ పరిశోధనలో సాధారణ క్యాన్సర్ కంటే బ్లడ్, బోన్‌మ్యారో, ల్యుకేమియా క్యాన్సర్లతో బాధపడేవారు కరోనా బారిన పడే అవకాశం 60 శాతం కంటే ఎక్కువ ఉందని తేల్చారు. ఇలా పరిశోధన చేస్తున్న సమయంలోనే 319 మంది రోగులు మరణించారని తెలిపారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com