యూపీ మంత్రికి కరోనా పాజిటివ్

corona positive to up minister
corona, positive, up, minister,
కరోనా మహమ్మారి ఎవ్వరిని వదలడం లేదు. అన్ని వర్గాల వారు కరోనా బారినపడుతున్నారు. సమాన్యులతో పాటు, సినీ, రాజకీయ ప్రముఖులు కూడా ఈ మహమ్మారి బారినపడుతున్నారు. ముఖ్యంగా రాజకీయ నాయకులకు వరుసగా కరోనా సోకుతుంది. తాజాగా ఉత్తరప్రదేశ్ పంచాయతీరాజ్ శాఖ మంత్రి భూపేంద్ర సింగ్ చౌదరి కరోనా బారిన పడ్డారు. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా తెలిపారు. డాక్టర్ల సలహా మేరకు ఆస్పత్రిలో చేరానని.. ఇటీవల తనను కలసిన వారందరూ కరోనా పరీక్షలు చేయించుకోవాలని కూడా ఆయన సూచించారు. క్వారంటైన్‌కు పరిమితమవ్వాలని కూడా అభ్యర్థించారు. కాగా.. ఆగస్టు 18న యూపీ ఆరోగ్య కుటుంబసంక్షేమ శాఖ మంత్రి కూడా కరోనా బారినపడ్డారు. మరో ఇద్దరు మంత్రులు కరోనాతో మృతి చెందిన విషయం తెలిసిందే.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com