మహారాష్ట్రను కలవరపెడుతున్న కరోనా

మహారాష్ట్రను కలవరపెడుతున్న కరోనా
మహారాష్ట్రలో కరోనా విలయతాండవం చేస్తుంది. దేశంలో రికార్డు స్థాయిలో కరోనా కేసులు మహారాష్ట్రలోనే నమోదవుతున్నాయి.

మహారాష్ట్రలో కరోనా విలయతాండవం చేస్తుంది. దేశంలో రికార్డు స్థాయిలో కరోనా కేసులు మహారాష్ట్రలోనే నమోదవుతున్నాయి. గడిచిన 24 గంటల్లో మొత్తం 14,718 పాజిటివ్ కేసులు నిర్థారణ అయ్యాయి. దీంతో రాష్ట్రంలో కరోనా బాధితుల సంఖ్య 7,33,568కి చేరాయి. అటు, మరణాలు కూడా రికార్డు సంఖ్యలో నమోదవుతున్నాయి. ఈ ఒక్కరోజే 355 మంది కరోనా కాటుకు బలికాగా.. కరోనా మరణాల సంఖ్య 23,444కి చేరాయి. కాగా.. ఇప్పటి వరకు 5,31,563 మంది కరోనా నుంచి కోలుకోగా.. ఇంకా 1,78,234 యాక్టివ్ కేసులు ఉన్నట్లు ఆ రాష్ట్ర ఆరోగ్యశాఖ గురువారం తెలిపింది.

Tags

Read MoreRead Less
Next Story