తమిళనాడులో నాలుగు లక్షలు దాటిన కరోనా కేసులు

తమిళనాడులో నాలుగు లక్షలు దాటిన కరోనా కేసులు
తమిళనాడులో కరోనా విజృంభణ కొనసాగుతుంది. ప్రతీ రోజు కొత్తగా ఆరువేలుకు చేరువలో కేసులు నమోదవుతున్నాయి.

తమిళనాడులో కరోనా విజృంభణ కొనసాగుతుంది. ప్రతీ రోజు కొత్తగా ఆరువేలుకు చేరువలో కేసులు నమోదవుతున్నాయి. గడిచిన 24 గంటల్లో 5,981 పాజిటివ్ కేసులు నమోదుకాగా, 109 మంది కరోనా కాటుకు బలైయ్యారని.. ఆ రాష్ట్ర ఆరోగ్యశాఖ హెల్త్ బులిటెన్ విడుదల చేసింది. తాజాగా నమోదైన కేసులతో తమిళనాడులో మొత్తం కేసుల సంఖ్య నాలుగు లక్షల మార్కును దాటింది. రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 4,03,242కు చేరింది. అటు, మరణాల సంఖ్య 6,948కు చేరింది. ఇప్పటివరకూ 3,43,930 మంది కోలుకోగా.. 53,364 మంది ఇంకా చికిత్స పొందుతున్నారు.

Tags

Read MoreRead Less
Next Story