తెలంగాణలో కరోనా కొత్త కేసులు..

తెలంగాణలో కరోనా కొత్త కేసులు..
X
రాష్ట్రంలో గురువారం 61,863 నమూనాలను పరీక్షించగా 2,932 మందికి పాజిటివ్ నిర్ధారణ అయింది. దీంతో ఇప్పటి వరకు నమోదైన కేసుల

రాష్ట్రంలో గురువారం 61,863 నమూనాలను పరీక్షించగా 2,932 మందికి పాజిటివ్ నిర్ధారణ అయింది. దీంతో ఇప్పటి వరకు నమోదైన కేసుల సంఖ్య 1,17,415 చేరింది. ఈ మేరకు వైద్య ఆరోగ్య శాఖ శుక్రవారం ఉదయం బులిటెన్ విడుదల చేసింది. నిన్న ఒక్కరోజే కరోనాతో 11 మంది మృతి చెందారు. దీంతో మృతుల సంఖ్య 799కి చేరింది. నిన్న రికవరీ అయిన కేసుల సంఖ్య 1580. దీంతో ఇప్పటి వరకు కోలుకున్న బాధితుల సంఖ్య 87,675కి చేరింది. రాష్ట్రంలో ప్రస్తుతం యాక్టివ్ కేసుల సంఖ్య 28,941కి చేరిందని వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది. ఇప్పటి వరకు తెలంగాణలో 12,04,343 కొవిడ్ టెస్టులు నిర్వహించినట్లు అధికారులు తెలిపారు. అత్యధిక కొవిడ్ కేసులు జీహెచ్ఎంసీ పరిధిలో నమోదవుతున్నట్లు అధికారులు వెల్లడించారు. నిన్న ఒక్కరోజే ఈ పరిధిలో 520 కేసులు నమోదయ్యాయి.

Tags

Next Story