Covid 19 : 24గంటల్లో వెయ్యికి పైగా కరోనా కేసులు

Covid 19 : 24గంటల్లో వెయ్యికి పైగా కరోనా కేసులు

గడిచిన 24 గంటల్లో దేశంలో వెయ్యికి పైగా కరోనా కేసులు నమోదయ్యాయి. బుధవారం ఆరోగ్య మంత్రిత్వ శాఖ గణాంకాల ప్రకారం, దేశంలో మొత్తం 1,134 కోవిడ్ కేసులు నమోదయినట్లు తెలుస్తోంది. తాజా కేసుల్లో, రోజువారీ పాజిటివిటీ 1.09 శాతంగా ఉండగా, వారపు పాజిటివిటీ రేటు 0.98 శాతంగా ఉంది. మంగళవారం, ఆరోగ్య శాఖ పంచుకున్న డేటా ప్రకారం, ఢిల్లీలో 83 కోవిడ్ -19 కేసులు 5.83 శాతం పాజిటివిటీ రేటుతో పాటు ఒకరు మృతి చెందారు. హెచ్3ఎన్2 ఇన్‌ఫ్లుఎంజా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో, గత కొన్ని రోజులుగా కోవిడ్ కేసుల సంఖ్య పెరిగింది.

ఢిల్లీలో శనివారం 58 కోవిడ్ కేసులు 3.52 శాతం పాజిటివ్ రేటు, ఆదివారం 3.95 శాతం పాజిటివ్‌ రేటుతో 72 కేసులు, సోమవారం 6.98 శాతం పాజిటివ్‌ రేటుతో 34 కేసులు నమోదయ్యాయి. మహమ్మారి ప్రపంచవ్యాప్తంగా వ్యాపించిన తర్వాత జనవరి 16 న మొదటిసారి కేసుల సంఖ్య సున్నాకి పడిపోయింది. తాజాగా కరోనా కేసుల్లో, దేశ రాజధానిలో కోవిడ్-19 కేసుల సంఖ్య 20,08,087కి చేరుకోగా, మరణాల సంఖ్య 26,524కి చేరుకుంది. హెచ్3ఎన్2 వైరస్ కారణంగానే ఇన్‌ఫ్లుఎంజా కేసులు పెరుగుతున్నాయని ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ఐసీఎంఆర్) తెలిపింది. H3N2 వైరస్ ఇతర ఉపరకాల కంటే ఎక్కువ ఆసుపత్రిలో చేరడానికి దారి తీస్తోంది. ముక్కు కారటం, నిరంతర దగ్గు, జ్వరం వంటి లక్షణాలు ఉంటాయి.

Tags

Read MoreRead Less
Next Story