ఆందోళనకరంగా ప్రణబ్ ముఖర్జీ ఆరోగ్యం

ఆందోళనకరంగా ప్రణబ్ ముఖర్జీ ఆరోగ్యం
మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఆరోగ్యం ఆందోళనకరంగానే ఉందని ఆర్మీ ఆస్పత్రి వైద్యులు ప్రకటించారు.

మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఆరోగ్యం ఆందోళనకరంగానే ఉందని ఆర్మీ ఆస్పత్రి వైద్యులు ప్రకటించారు. ఆయన డీప్ కోమాలో ఉన్నారని తెలిపారు. రోజురోజుకు ఆయన ఆరోగ్యం క్షీణిస్తుందని.. మూత్రపిండాలు పనిచేయడం లేదని ఆస్పత్రి వర్గాలు తెలిపాయి. ఊపిరితిత్తుల్లో కూడా ఇన్‌ఫెక్షన్ పెరిగిందని.. వెంటిలేటర్ సహాయంతో చికిత్సనందిస్తున్నారు. కాగా.. ప్రణబ్ ముఖర్జీకి కరోనా పాజిటివ్ అని తేలడంతో చికిత్స కోసం ఆస్పత్రిలో చేరారు. ఈ నెల 10న ఆయనకు బ్రెయిన్ సర్జరీ జరిగింది.

Tags

Read MoreRead Less
Next Story