ఒక వ్యక్తికి రెండు సార్లు కరోనా.. ఎవరూ ఆందోళన చెందవద్దు: ఐసీఎంఆర్

ఒక వ్యక్తికి రెండు సార్లు కరోనా.. ఎవరూ ఆందోళన చెందవద్దు: ఐసీఎంఆర్
హాంకాంగ్‌లో ఓ వ్యక్తి నాలుగు నెలల వ్యవధిలో రెండు సార్లు కరోనా బారిన పడిన విషయం ఇప్పుడు యావత్ ప్రపంచాన్ని వణికిస్తుంది.

icmr comments on honkong new corona case

icmr, honkong, corona,

హాంకాంగ్‌లో ఓ వ్యక్తి నాలుగు నెలల వ్యవధిలో రెండు సార్లు కరోనా బారిన పడిన విషయం ఇప్పుడు యావత్ ప్రపంచాన్ని వణికిస్తుంది. దీంతో ఈ మహమ్మారి మళ్లీ మళ్లీ సోకుతుందేమో అన్న భయంతో చాలా మంది సతమతవుతున్నారు. అయితే, ఈ విషయంపై ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఐసీఎంఆర్ డైరక్టర్ జనరల్ బలరామ్ భార్గవ భరోసా ఇచ్చారు. హాంకాంగ్ లో బయటపడిన ఆ కేసు ఓ అరుదైనదిగా అభివర్ణించారు. ఇలా ఒక వ్యక్తికి రెండు సార్లు కరోనా సోకడం అనేది అనేక అంశాల మీద ఆధారపడుతుందని అన్నారు. ఇలా అందరూ ఇదే కోవకు చెందుతారని భయపడొద్దని అన్నారు. హాంకాంగ్ లో నమోదైన ఈ కేసులు నిశితంగా పరిశీలిస్తున్నామని తెలిపారు. ఈ మహమ్మారి నుంచి కోలుకున్న అనంతరం శరీరంలో రోగ నిరోధక శక్తి ఎంత కాలం పాటు నిలిచి ఉంటుందనేది తెలియాల్సి ఉందని ఆయన చెప్పారు.

Tags

Read MoreRead Less
Next Story