పురుషుల కంటే మహిళలకే కరోనాను ఎదుర్కునే శక్తి అధికం

పురుషుల కంటే మహిళలకే కరోనాను ఎదుర్కునే శక్తి అధికం
కరోనాను ఎదుర్కొనే శక్తి పురుషుల కంటే మహిళలకే ఎక్కువగా ఉందని ఓ అధ్యయనంలో తేలింది

కరోనాను ఎదుర్కొనే శక్తి పురుషుల కంటే మహిళలకే ఎక్కవగా ఉందని ఓ అధ్యయనంలో తేలింది. మనిషిలో ఉండే టి కణాలే దీనికి కారణమని ఈ అధ్యయనం చేసిన పరిశోధకులు తెలిపారు. ఈ టి కణాలు పురుషుల్లో కంటే మహిళల్లోనే ఎక్కువగా ఉంటాయి. ఈ టి కణాలు మనిషిలో రోగ నిరోదక శక్తిని పెంచేందుకు దోహదపడతాయి. ఈ కణాల్నే లింఫోసైట్స్ అని కూడా పిలుస్తారు. ఈ కణాలు ఎవరిలో అయితే, బలంగా ఉంటాయో వారికి రోగ నిరోధక శక్తి పటిష్టంగా ఉంటుందని పరిశోధకులు తెలిపారు. అమెరికాలో ఓ ఆస్పత్రిలో 18 ఏళ్లు పైబడిన 86 మంది కరోనా రోగులపై పరిశోధలను చేయగా.. మహిళల్లోనే కరోనాను ఎదుర్కొనే శక్తి ఉందని నిర్థారించారు. దీనికి కారణం టీ కణాలని తెలిపారు. గతంలో కూడా పురుషుల కంటే మహిళలకు కరోనాను ఎదుర్కొనే శక్తి ఎక్కువ ఉంటుంది అని పలువురు చెప్పినప్పటికీ.. స్పష్టమైన కారణాలు తెలియజేయలేదు. కానీ, దానికి కారణం టి కణాలని తేలింది.

Tags

Read MoreRead Less
Next Story