ఇద్దరిపై ప్రయోగించిన ఆక్స్‌ఫర్డ్ టీకా.. ఫలితం..

ఇద్దరిపై ప్రయోగించిన ఆక్స్‌ఫర్డ్ టీకా.. ఫలితం..
కరోనా మహమ్మారిపై యుద్దంలో భాగంగా ప్రపంచవ్యాప్తంగా వ్యాక్సిన్ తయారుచేస్తున్న సంగతి తెలిసిందే.

కరోనా మహమ్మారిపై యుద్దంలో భాగంగా ప్రపంచవ్యాప్తంగా వ్యాక్సిన్ తయారుచేస్తున్న సంగతి తెలిసిందే. అయితే, ఆక్స్‌ఫర్డ్ టీకా క్లినికల్ ట్రయల్స్ భారత్‌లో ప్రారంభమయైన విషయం తెలిసిందే. ఈ టీకా రెండో దశ క్లినికల్ ట్రయల్స్ సీరం ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇండియా ఆధ్వర్యంలో పుణెలోని భారతి విద్యాపీఠ్‌ మెడికల్‌ కాలేజీ అండ్‌ హాస్పిటల్‌లో చేపడుతుంది. అయితే, ఈ ట్రయల్స్ లో భాగంగా ఇద్దరు వలంటీర్లకు వ్యాక్సిన్‌ ఇచ్చామని సీనియర్ డాక్టర్ తెలిపారు. అయితే, వారి పరిస్థితి సాధారణంగానే ఉందని.. ఇద్దరూ బాగానే ఉన్నారని తెలిపారు. ఎలాంటి నొప్పిగాని, సైడ్ ఎఫెక్ట్స్ లాంటివి ఏవీ కనిపించలేదని తెలిపారు. వ్యాక్సిన్ ఇచ్చిన 30 నిమిషాల వరకూ వారిని పరిశీలించి.. తరువాత ఇంటికి పంపామని అన్నారు. అయితే, డాక్టర్లు మాత్రం వారిని ఫాలోఅప్‌ చేస్తున్నారని వివరించారు. మళ్లీ నెల తర్వాత వారికి టీకా ఇస్తామన్నారు.

Tags

Read MoreRead Less
Next Story