నాన్నఆరోగ్యం మెరుగవుతోంది: చరణ్

X
By - Admin |26 Aug 2020 9:44 PM IST
ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఆరోగ్యం మెరుగుపడుతుందని ఆయన కుమారుడు ఎస్పీ చరణ్ తెలిపారు.
ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఆరోగ్యం మెరుగుపడుతుందని ఆయన కుమారుడు ఎస్పీ చరణ్ తెలిపారు. ఈ మేరకు ఆయన ఓ వీడియోను విడుదల చేశారు. ఆస్పత్రిలో తన తండ్రిని చూడడానికి వెళ్లానని ఆయన అన్నారు. ఆయనతో మాట్లాడానని.. ఆయన మునుపుటి కంటే కాస్తా కోలుకున్నారని తెలిపారు. ఎస్పీ బాల సుబ్రహ్మణ్యం తన ఆలోచనలను ఓ పేపరుపై రాయలని ప్రయత్నించారని.. అయితే, సరిగా పెన్నును పట్టుకోలేకపోయారని చరణ్ అన్నారు. బయట ప్రపంచంలో ఏం జరుగుతుందో ఆయనకు తెలియడం కోసం ప్రతీరోజు ఓ వార్తా పత్రికను చదవమని ఆస్పత్రి సిబ్బందికి తెలిపానని చరణ్ చెప్పారు.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com