TS : తమిళనాడు ‘ది కేరళ స్టోరీ’ సినిమా రద్దు

తమిళనాడు రాష్ట్ర వ్యాప్తంగా ‘ది కేరళ స్టోరీ’ సినిమా షోలు రద్దు చేశారు. చెన్నై, కోయంబత్తూర్, మధురై, సేలంతో పాటు ముఖ్య నగరాల్లోని మల్టీప్లెక్స్‌లలో షోలు రద్దు అయ్యాయి. సినిమాను బ్యాన్ చేయాలని రాష్ట్రంలో నిరసనలు వెల్లువెత్తుతుండంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.సినిమాను ప్రదర్శిస్తే థియేటర్లను ముట్టడిస్తామని తమిళనాడులోని పలు పార్టీలు, ముస్లిం సంఘాలు హెచ్చరికలు జారీ చేశారు. దీంతో ముందస్తు హెచ్చరికలతో వెంటనే అప్రమత్తమైన థియేటర్ యాజమాన్యాలు అన్ని షోలు రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు.
ఈ సినిమా మొదటినుంచి వివాదాల్లో చిక్కుకుంది. అయినా మొదటి రోజు భారీగా కలెక్షన్లు వచ్చాయి గత కొంత కాలంగా కేరళలో అమ్మాయిలను మతం మార్చి టెర్రరిజంలోకి తీసుకెళ్తున్నారన్న ఆరోపణల నేపధ్యంలో ఈ కథనే సినిమాగా తెరకెక్కించాడు దర్శకుడు సుదీప్తో సేన్.సినిమా విడుదలకు ముందే వివాదాస్పదం అయింది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com