వ్యవసాయ శాఖ మంత్రికి కరోనా పాజిటివ్

వ్యవసాయ శాఖ మంత్రికి కరోనా పాజిటివ్
X
జార్ఖాండ్ వ్యవసాయ శాఖ మంత్రికి కరోనా సోకింది. ఈ విషయాన్ని మంత్రి స్వయంగా తన ట్విట్టర్ అకౌంట్‌లో ధ్రువీకరించారు.

దేశంలో కరోనా కలకలం సృష్టిస్తోంది. సామాన్యుల నుంచి రాజకీయ నాయకుల వరకు ఎవరినీ ఈ కరోనా మహమ్మారి వదలడం లేదు. తాజాగా జార్ఖాండ్ వ్యవసాయ శాఖ మంత్రికి కరోనా సోకింది. మంత్రి బాదల్ పత్రలేఖ్‌కు కరోనా పాజిటివ్‌‌గా నిర్ధారణ అయింది. ఈ విషయాన్ని మంత్రి స్వయంగా తన ట్విట్టర్ అకౌంట్‌లో ధ్రువీకరించారు. తనకు సన్నిహితులుగా ఉన్న వారు కూడా వైద్య పరీక్షలు చేయించుకోవాలని, సురక్షితంగా ఇంటిలోనే ఉండాలని ఆయన కోరారు. శనివారం రాత్రి తనకు వైద్య పరీక్షల రిపోర్ట్ వచ్చిందని ఆయన తెలిపారు.

Tags

Next Story