తాజా వార్తలు

సీఎం జగన్‌కు ఎంపీ రఘురామకృష్ణంరాజు లేఖ

ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి.. ఎంపీ రఘురామకృష్ణంరాజు మరో లేఖ రాశారు.

సీఎం జగన్‌కు ఎంపీ రఘురామకృష్ణంరాజు లేఖ
X

ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి.. ఎంపీ రఘురామకృష్ణంరాజు మరో లేఖ రాశారు. ఏపీలో పాఠశాలలు సెప్టెంబర్ 5 నుంచి ప్రారంభించాలని ప్రభుత్వం నిర్ణయించిన విషయం తెలిసిందే. ప్రభుత్వం నిర్ణయం సరైనది కాదని రఘురామకృష్ణంరాజు లేఖ రాశారు. రాష్ట్రంలో పాఠశాలలు ప్రారంభించడానికి ప్రభుత్వం చేస్తున్న సన్నహాలను వాయిదా వేయాలని కోరారు. ఏపీలో రోజువారి కేసులు పదివేల వరకూ వస్తున్నాయని.. ఈ తరుణంలో పాఠశాలలు ప్రారంభించాలనే నిర్ణయం సరైనది కాదని అన్నారు. పాఠశాలలు ప్రారంభమయితే.. పిల్లలకు కరోనా సోకే ప్రమాదం ఉందని, ప్రాణహాని ఉందని, తల్లితండ్రులు భయబ్రాంతులకు గురువవుతున్నారని అన్నారు. పిల్లలకు ఏమైనా జరిగితే, ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుందని తెలిపారు. పాఠశాలలు ప్రారంభించే విషయంలో అందరి సలహాలు, సూచనలు స్వీకరించి తుది నిర్ణయం తీసుకోవాలన్నారు.

Next Story

RELATED STORIES