సుశాంత్ చనిపోయిన రోజు అతడిని దుబాయ్ డ్రగ్ డీలర్ కలిశారు: స్వామి

సుశాంత్ చనిపోయిన రోజు అతడిని దుబాయ్ డ్రగ్ డీలర్ కలిశారు:  స్వామి
బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మృతిపై బీజేపీ సీనియర్ నేత సుబ్రహ్మిణియన్ స్వామి వరుసగా సంచలన ఆరోపణలు చేస్తున్నారు.


బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మృతిపై.. బీజేపీ సీనియర్ నేత సుబ్రహ్మిణియన్ స్వామి వరుసగా సంచలన ఆరోపణలు చేస్తున్నారు. ఇటీవల సుశాంత్ మృతికి.. దుబాయితో లింక్ ఉందని ఆరోపించిన విషయం తెలిసిందే. అయితే, తాజాగా.. సుశాంత్ చనిపోయిన రోజు దుబాయ్ డ్రగ్ డీలర్ అయష్ ఖాన్ అతడిని కలిశారని ఆరోపించారు. ట్విట్టర్ వేదికగా ఆయన ఈ ఆరోరపణలు చేశారు. సునంద పుష్కర్ మృతి చెందిన తరువాత పోస్టుమార్టంలో ఎయిమ్స్ వైద్యులు ఆమె కడుపులో ఏమి గుర్తించారో అదే అసలైన ఆధారంగా నిలిచింది. కానీ శ్రీదేవి, సుశాంత్ విషయంలో ఇది జరగలేదు. సుశాంత్ చనిపోయిన రోజు దుబాయ్‌ డ్రగ్ డీలర్ అయష్ ఖాన్ అతడిని కలిశాడు. ఎందుకు? అని ప్రశ్నించారు. శ్రీదేవితో పాటు గతంలో నమోదైన హైప్రొఫైల్ మృతి కేసుల్లోనూ సీబీఐ దర్యాప్తు చేపట్టాలని ఆయన డిమాండ్ చేశారు.

Tags

Read MoreRead Less
Next Story