తమిళనాడులో కరోనా విజృంభణ.. కొత్తగా 6వేలు కేసులు

తమిళనాడులో కరోనా విజృంభణ.. కొత్తగా 6వేలు కేసులు
తమిళనాడులో కరోనా తీవ్రత ఏమాత్రం తగ్గడంలేదు. ప్రతీరోజు ఐదువేలకు పైగా కేసులు నమోదవుతున్నాయి.

తమిళనాడులో కరోనా తీవ్రత ఏమాత్రం తగ్గడంలేదు. ప్రతీరోజు ఐదువేలకు పైగా కేసులు నమోదవుతున్నాయి. గడిచిన 24 గంటల్లో 5,975 పాజిటివ్ కేసులు నమోదయ్యాయని రాష్ట్ర ఆరోగ్యశాఖ తెలిపింది. కాగా.. కరోనాతో మొత్తం 97 మంది మరణించారు. కొత్తగా నమోదైన కేసులతో తమిళనాడులో కరోనా బాధితుల సంఖ్య 3,79,385కు చేరింది. అటు, సంఖ్య 6,517కు చేరింది. అయితే, రాష్ట్రంలో రికవరీ రేటు గణనీయంగా నమోదవ్వడం కాస్తా ఊరట కలిగిస్తుంది. ఇప్పటి వరకు 3,19,327 మంది కోలుకోగా ప్రస్తుతం 53,541 యాక్టివ్ కేసులు ఉన్నట్లు ఆ రాష్ట్ర ఆరోగ్యశాఖ పేర్కొంది.

Tags

Read MoreRead Less
Next Story