దేశంలో కొత్తగా 61,408 కరోనా పాజిటివ్ కేసులు

దేశంలో కొత్తగా 61,408 కరోనా పాజిటివ్ కేసులు
దేశంలో కరోనా స్వైర విహారం చేస్తోంది. దేశవ్యాప్తంగా మొత్తం పాజిటివ్‌ కేసుల సంఖ్య 31లక్షల మార్కును దాటాయి.

దేశంలో కరోనా స్వైర విహారం చేస్తోంది. దేశవ్యాప్తంగా నిత్యం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య అంతకంతకూ పెరుగుతూనే ఉంది. ప్రతి రోజు వేల సంఖ్యలో పాజిటివ్‌ కేసులు నిర్ధారణ అవుతున్నాయి. దేశవ్యాప్తంగా మొత్తం పాజిటివ్‌ కేసుల సంఖ్య 31లక్షల మార్కును దాటాయి. తాజాగా గడిచిన 24 గంటల్లో కొత్తగా 61,408 కరోనా కేసులు నిర్ధారణ అయ్యాయి. దీంతో దేశంలో మొత్తం నమోదైన కేసుల సంఖ్య 31,06,349కు చేరింది. ఒక్కరోజే కరోనా బారి నుంచి 57,468 మంది కోలుకొని డిశ్చార్జి అయ్యారు. దీంతో కరోనా బారి నుంచి మొత్తం 23,38,036 మంది కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. దేశంలో ప్రస్తుతం 7,10,771 యాక్టివ్‌ కేసులున్నాయని కేంద్ర కుటుంబ, ఆరోగ్యమంత్రిత్వశాఖ తెలిపింది. కరోనా బారిన పడి ఒక్కరోజే 836 మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో దేశవ్యాప్తంగా మొత్తం మృతుల సంఖ్య 57,542కి చేరింది. ప్రస్తుతం దేశంలో రికవరీ రేటు 75.3 ఉంది. మరణాల రేటు 1.9గా ఉందని మంత్రిత్వశాఖ పేర్కొంది.

Tags

Read MoreRead Less
Next Story