దేశంలో కొత్త‌గా 69 వేల క‌రోనా కేసులు

దేశంలో కొత్త‌గా 69 వేల క‌రోనా కేసులు
దేశంలో గడిచిన 24 గంట‌ల్లో 69,239 పాజిటివ్ కేసులు న‌మోద‌య్యాయి. దీంతో మొత్తం క‌రోనా కేసుల సంఖ్య 30,44,941కి చేరింది.

దేశంలో కరోనా వైరస్ కలకలం సృష్టిస్తోంది. దేశవ్యాప్తంగా ఈ మహమ్మారి విజృంభిస్తోంది. నిత్యం పాజిటివ్ కేసుల సంఖ్య అంతకంతకూ పెరుగుతూనే ఉంది. పాజిటివ్ కేసులతో పాటు మరణాల సంఖ్య కూడా అంతకంతకూ పెరుగుతూనే ఉంది. తాజాగా గడిచిన 24 గంట‌ల్లో 69,239 పాజిటివ్ కేసులు న‌మోద‌య్యాయి. దీంతో దేశవ్యాప్తంగా మొత్తం క‌రోనా కేసుల సంఖ్య 30,44,941కి చేరింది. ఇందులో 7,07,668 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. కరోనా బారి నుంచి 22,80,567 మంది కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. క‌రోనా వైర‌స్‌తో ఒక్కరోజే కొత్త‌గా 912 మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో దేశంలో క‌రోనా మ‌ర‌ణాలు 56,706కు చేరుకున్నాయ‌ని కేంద్ర ఆరోగ్య శాఖ ప్ర‌క‌టించింది.

Tags

Read MoreRead Less
Next Story