పిల్లలనే టార్గెట్ చేస్తున్న కరోనా
కరోనా బారిన ఎక్కువగా ఐదు నుంచి 17 ఏళ్ల మధ్య వయసున్న వారు పడుతున్నారని ఓ అద్యాయనంలో వెల్లడైంది. రక్తపరీక్షలు జరిపి కరోనాను ఎదుర్కొనే యాంటీ బాడీ ఎంత మందిలో ఉన్నాయనే విషయాన్ని కనుక్కోవడం కోసం ఢిల్లీలో నిర్వహించని ఈ అద్యాయనంలో ఈ విషయం తేలింది. ఈ సర్వేలో ఈ వయసుల వారిలో 34.7 శాతం కరోనా బారినపడ్డారని తేలింది. అయితే, కుటుంబసభ్యులు లేదా ఇళ్లలోని పనిమనుషుల ద్వారా వీరు వైరస్ బారిన పడుతున్నట్టు నిపుణులు భావిస్తున్నారు. 'స్కూల్స్ బంద్ చేసినా.. పిల్లలను ఇంట్లో ఉంచండం కష్టంగా మారుతోంది. వారు ఆడుకోవడానికి ఇళ్లనుంచి బయటకు వెళ్తూ ఉంటారు. అయితే, ఇది ఒక ఊహ మాత్రమేనని.. దీనిపై ఒక అవగాహనకు రావాలంటే.. మరింత లోతుగా అద్యయనం చేయాలి' అని కరోనాపై ఢిల్లీ ప్రభుత్వం నియమించిన కమిటీకి నేతృత్వం వహిస్తున్న డా. మహేష్ వర్మ వ్యాఖ్యానించారు.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com