ఘోర రోడ్డు ప్రమాదం.. 10 మంది దుర్మరణం

X
By - Admin |25 Aug 2020 12:24 PM IST
ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాద ఘటనలో 10 మంది దుర్మరణం పాలయ్యారు.
పాకిస్తాన్‌లో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాద ఘటనలో 10 మంది దుర్మరణం పాలయ్యారు. బలూచిస్తాన్ ప్రావిన్స్‌లోని కరాచీ-క్వెట్టా రహదారిపై ఈ ప్రమాదం జరిగింది. 20 మంది ప్రయాణికులతో నిండిన వ్యాన్ వెళుతుండగా ముందు నుంచి వస్తున్న ట్రక్ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో 10 మంది మృత్యువాత పడ్డారు. పలువురికి తీవ్ర గాయలయ్యాయి. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. గాయపడిన వారిని స్థానిక హాస్పిటల్‌కు తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Tags
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com