Adipurush: 'ఆదిపురుష్' ఫస్ట్ లుక్‌కు డేట్ ఫిక్స్.. అప్పటివరకు ఆగాల్సిందే..!

Adipurush: ఆదిపురుష్ ఫస్ట్ లుక్‌కు డేట్ ఫిక్స్.. అప్పటివరకు ఆగాల్సిందే..!
Adipurush: ఆదిపురుష్ చిత్రం రామాయణంపై ఆధారపడి ఉంటుంది కాబట్టి.. శ్రీరామనవమికి ఫస్ట్ లుక్ రిలీజ్ అవుతుందని అనుకున్నారంతా.

Adipurush: 'బాహుబలి' తర్వాత పాన్ ఇండియా స్టార్‌గా మారిపోయాడు ప్రభాస్. ప్రభాస్‌తో సినిమా తీస్తే.. ప్రతీ భాషా ప్రేక్షకులు చూస్తారని ఫిక్స్ అయిపోయారు మేకర్స్. దీంతో పాన్ ఇండియా వైడ్‌గా పాపులారిటీతో పాటు కలెక్షన్లు కూడా బాగా వస్తాయి. అందుకే ప్రభాస్ డేట్స్ కోసం టాలీవుడ్ మాత్రమే కాదు బాలీవుడ్ మేకర్స్ కూడా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇక ప్రభాస్ నటిస్తు్న్న అప్‌కమింగ్ మూవీ 'ఆదిపురుష్' గురించి ఓ క్రేజీ రూమర్ వైరల్ అవుతోంది.

బాలీవుడ్ దర్శకుడు ఓం రౌత్‌తో కలిసి ప్రభాస్ చేస్తున్న చిత్రమే 'ఆదిపురుష్'. ప్రభాస్.. పాన్ ఇండియా స్టార్‌గా స్టార్‌డమ్ తెచ్చుకున్న తర్వాత సేఫ్‌గా కమర్షియల్ సినిమాలు చేయకుండా ప్రయోగాల వైపు అడుగులేస్తున్నాడు. ఇటీవల 'రాధే శ్యామ్' అనే పూర్తిస్థాయి లవ్ స్టోరీ తర్వాత ఆదిపురుష్ అనే మైథలాజికల్ మూవీని సెలక్ట్ చేసుకున్నాడు. అంతే కాకుండా ఓ బాలీవుడ్ డైరెక్టర్‌తో ప్రభాస్ పనిచేయడం కూడా ఇదే మొదటిసారి.

ఆదిపురుష్ చిత్రం రామాయణ కథపై ఆధారపడి ఉంటుంది కాబట్టి.. గతేడాది నుండి శ్రీరామనవమికి రాముడిగా ప్రభాస్ ఫస్ట్ లుక్ రిలీజ్ అవుతుందని ఎదురుచూశారు ఫ్యాన్స్. కానీ రెండేళ్లుగా వారికి నిరాశే మిగిలింది. కానీ ఫైనల్‌గా ఈ ఏడాది అక్టోబర్ 23 అంటే ప్రభాస్ బర్త్ డే రోజున ఆదిపురుష్ ఫస్ట్ లుక్ రిలీజ్ అవుతుందన్న రూమర్ ప్రస్తుతం వైరల్‌గా మారింది. ఇక ఈ చిత్రంలో సీతగా కృతి సనన్ నటిస్తుండగా లక్ష్మణుడిగా సన్నీ సింగ్ కనిపించనున్నాడు.

Tags

Read MoreRead Less
Next Story