Adipurush : ప్రభాస్ 'ఆదిపురుష్' టీజర్ రిలీజ్ ఎప్పుడంటే..

Adipurush : ప్రభాస్ ఆదిపురుష్ టీజర్ రిలీజ్ ఎప్పుడంటే..
Adipurush : టీజర్ రిలీజ్ నుంచి జనవరి 12న సినిమా రిలీజ్ అయ్యే వరకు పెద్ద క్యాంపెయిన్ నడవనుందని ప్రకటించారు

Adipurush : రెబల్ స్టార్ అభిమానులకు ఇదో పెద్ద శుభవార్త. ఆదిపురుష్ ఫస్ట్ లుక్ టీజర్‌ను అక్టోబర్ 3న రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. టీజర్ రిలీజ్ నుంచి జనవరి 12న సినిమా రిలీజ్ అయ్యే వరకు పెద్ద క్యాంపెయిన్ నడవనుందని ప్రకటించారు. ఈ సారి ఢిళ్లీలో రావన దహన కార్యక్రమాన్ని ప్రభాస్ చేతుల మీదుగా జరిపించాలని ఇప్పటికే ఆయనకు ఆహ్వానం కూడా అందింది. రామాయణాన్ని ఇతివృత్తంగా చేసుకొని ఓం రౌత్ ఈ ఆదిపురుష్‌ను తెరకెక్కించారు. శ్రీరాముడిగా ప్రభాస్, సీతగా క్రితి సనన్, రావణుడి పాత్రలో సైఫ్ అలీ ఖాన్ కనిపించనున్నారు.

భూషణ్ కుమార్ ఈ చిత్రాన్ని నిర్మించారు. ఇది అతి పెద్ద ప్యాన్ ఇండియా సినిమా మాత్రమే కాకుండా.. ఇప్పటి వరకు ఇండియన్ సినిమాలో చూడని విజువల్ ఎఫెక్ట్స్ ఇందులో చూపించనున్నట్లు దర్శకుడు ఓంరౌత్ ప్రకటించారు. ఆదిపురుష్ టీజర్ సెప్టెంబర్ చివరి వారంలో రిలీజ్ అవనుందని మరి కొందరు రూమర్స్ స్ప్రెడ్ చేస్తున్నారు. అయితే అక్టోబర్ 3నే రిలీజ్ కానున్నట్లు అఫిషియల్ అనౌన్స్‌మెంట్ వచ్చింది. శ్రీరాముడిగా ప్రభాస్‌ను తప్ప ఇప్పటి పరిస్థితుల్లో ఎవర్నీ ఊహించుకోలేనని దర్శకుడు ఓంరౌత్ అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.

Tags

Read MoreRead Less
Next Story