Adipurush On OTT: చడీచప్పుడు కాకుండా ఓటీటీలోకి ఆదిపురుష్
ప్రభాస్ రాఘవుడిగా నటించిన ఆదిపురుష్ చిత్రం చడీచప్పుడు లేకుండా ఓటీటీలో ప్రత్యక్షమైంది(Adipurush On OTT). ఎటువంటి ముందస్తు ప్రకటన లేకుండా సైలెంట్‌గా అమెజాన్ ప్రైమ్‌లో గురువారం అర్ధరాత్రి నుంచి స్ట్రీమింగ్ అవుతోంది. ప్రభాస్ (Prabhas) హీరోగా ఓం రౌత్ (Om raut) దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా ‘ఆదిపురుష్’ (Adipurush). భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమా మిశ్రమ స్పందనలకే పరిమితమైంది. ఇందులో జానకి పాత్రలో కృతిసనన్ (Kriti Sanon) అలరించింది. ఆదిపురుష్ ఓటీటీ హక్కులను ప్రైమ్ వీడియో రూ.150-200 కోట్లు పెట్టి మరీ సొంతం చేసుకున్నట్లు తెలుస్తోంది. మరి బాక్సాఫీస్ దగ్గర చతికిలపడ్డ ఈ సినిమాకు ఓటీటీలో స్పందన ఎలా ఉంటుందో చూడాలి!
ఇంతకీ సినిమా కథేంటంటే
వాల్మీకి రచించిన ఇతిహాసం రామాయణంలోని కొన్ని ప్రధాన ఘట్టాల ఆధారంగా రూపొందిన చిత్రమిది. మర్యాద పురుషోత్తముడైన రాఘవ వనవాసం స్వీకరించడం నుంచి కథ ప్రారంభం అవుతుంది. తన అర్ధాంగి జానకి, సోదరుడు శేషుతో కలిసి సత్యం, ధర్మమే తన ఆయుధంగా వనవాసం గడుపుతుంటాడు. శత్రు దుర్భేద్యమైన లంకని ఏలుతున్న లంకేశ్ తన సోదరి శూర్పణఖ చెప్పిన మాటలు విని జానకిని అపహరిస్తాడు. అశోకవనంలో బంధిస్తాడు. తన జానకిని తిరిగి తీసుకొచ్చేందుకు రాఘవ ఏం చేశాడు?రతరాలు చెప్పుకొనేలా సాగిన ఆ పోరాటంలో చెడుపై మంచి ఎలా గెలిచిందన్నది కథ. ఈ చిత్రంలో ప్రభాస్ శ్రీరాముడిగా తొలిసారి ఒక పౌరాణిక పాత్రలో నటించాడు. రాఘవ్ పాత్రలో ప్రభాస్ ఒదిగిపోయాడు. అతని ఆహార్యం ఆ పాత్రకు బాగా సెట్ అయింది. ఈ సినిమాలో ఓ కొత్త రాముడిని ప్రేక్షకులు చూశారు.
ఈ చిత్రానికి సంగీతం: అజయ్ -అతుల్; నేపథ్య సంగీతం: సంచిత్ బల్హారా, అంకిత్ బల్హారా; సినిమాటోగ్రఫీ: కార్తిక్ పళణి; ఎడిటింగ్: అపూర్వ మోత్వాలే సాహాయ్, అనిష్ మహత్రే; నిర్మాత: భూషణ్‌కుమార్, కృష్ణకుమార్, ఓంరౌత్, ప్రసాద్ సుతార్ రాజేశ్ నాయర్; స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: ఓం రౌత్
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com