BOLLYWOOD: అనన్యాపాండే, ఆదిత్య రాయ్ ప్రేమలో పడ్డారా..!
బాలీవుడ్ నటి అనన్యాపాండే, నటుడు ఆదిత్య రాయ్ కపూర్ ప్రేమలో ఉన్నట్లు జోరుగా సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతుంది. ఈ నేపథ్యంలో తాజాగా ఈ జంటకు సంబంధించిన పలు ఫొటోలు ఆన్‌లైన్‌లో లీక్ అయ్యాయి. ప్రస్తుతం స్పెయిన్ టూర్‌లో ఉన్న వీరిద్దరూ అక్కడి వాతావరణాన్ని ఎంజాయ్ చేస్తూ కనిపించారు. అయితే, ఈ ఫొటోల్లో ఆదిత్య.. అనన్యను హాగ్ చేసుకుని.. చుట్టూ ఉన్న పరిసరాలను వీక్షిస్తూ దర్శనమిచ్చారు. ఈ ఫొటోలను చూసిన అభిమానులు వీళ్లు లవ్‌లో ఉన్నారంటూ కన్ఫామ్ చేస్తున్నారు.
ఆదిత్య అంటే తనకు ఇష్టమని, అతడి లుక్స్ బాగుంటాయని గతంలో అనన్య అన్నారు. ఇక బాలీవుడ్‌లో జరిగిన పలు పార్టీలకు వీరిద్దరూ కలిసి వెళ్లడం.. ఫంక్షన్స్‌లోనూ సరదాగా మాట్లాడుకోవడం, డ్యాన్స్‌లు చేయడం వంటి ఫొటోలు గతంలో బయటకు వచ్చాయి. దీంతో వీరిద్దరూ రిలేషన్‌లో ఉన్నారంటూ ఇప్పటికే ఎన్నోసార్లు ప్రచారం జరిగింది. తాజాగా లీకైన ఫొటోలతో ఆ ప్రచారానికి మరింత ఆజ్యం పోసినట్లు అయ్యింది. లైగర్ తర్వాత అనన్య.. డ్రీమ్‌గర్ల్ 2, కంట్రోల్ వంటి ప్రాజెక్ట్‌లు చేస్తున్నారు.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com