Chiru-Pavan: చిరంజీవిపై పవన్ అభిమానుల గుర్రు..

Chiru-Pavan: చిరంజీవిపై పవన్ అభిమానుల గుర్రు..
వాల్తేర్ పై ఎఫెక్ట్ పడుతుందా..?

జనసేనకు జనాధరణ పెరుగుతుంటే మెగాస్టార్ మాత్రం దానిపై నీళ్లు చల్లే ప్రయత్నం చేస్తున్నాడు....తన కొత్త చిత్రం వాల్తేరు వీరయ్య ఫ్రీ రిలీజ్ ఈవెంట్ లో మాట్లాడిన తీరు జనసేన అభిమానులకు అలాగే మెగా అభిమానులు కూడా అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు

జనసేన వేదికగా ప్రభుత్వాన్ని నిత్యం ప్రశ్నిస్తూ.. ఆంధ్రప్రదేశ్ లో ప్రతిపక్ష నేతగా దూసుకుపోతున్నారు. గత ఎన్నికల్లో ఇబ్బంది పడ్డా.. ఈ సారి ప్రజాబలాన్ని సమీకరించుకుని మరింత ఉత్సాహంగా జగన్ పై దండెత్తబోతున్నాడు. ఏపిలో ఏ చిన్న ఇష్యూ జరిగినా వెంటనే వెళుతూ.. నిత్యం ప్రజల్లో ఉంటున్నాడు పవన్ కళ్యాణ్‌. అయితే పవన్ కు పూర్తి వ్యతిరేకంగా చిరంజీవి తీరు ఉంటోంది. ఆ మధ్య టికెట్ రేట్లకు, థియేటర్స్ కు సంబంధించిన విషయంలో ఈయన వినమ్రంగా ఉండటం ఎవరికీ నచ్చలేదు. ఇదే విషయాన్ని పవన్ కళ్యాణ్‌ కూడా ఓ మీటింగ్ లో చెప్పాడు. అయితే లేటెస్ట్ గా చిరంజీవి కొత్త సినిమా వాల్తేర్ వీరయ్య ప్రీ రిలీజ్ ఈవెంట్ కు సంబంధించిన ఇష్యూ ఇంకా పెద్దది.

వైజాగ్ లో వాల్తేర్ వీరయ్య ప్రీ రిలీజ్ ఫంక్షన్ కు వీళ్లు కోరిన చోట పర్మిషన్ ఇవ్వలేదు. తర్వాత మరోచోటికి వెన్యూ మార్చుకుంటే.. అక్కడా నో చెప్పారు. ఇలా రెండు సార్లు తిరస్కరించిన తర్వాతే ఫంక్షన్ కు పర్మిషన్ ఇచ్చారు. ఈ విషయాన్ని పబ్లిక్ గా ఖండించాల్సిన చిరంజీవి అవేవీ పట్టించుకోకుండా.. ఇంకా చెబితే మను ఇబ్బంది పెట్టిన జగన్ ప్రభుత్వానికి ప్లస్ అయ్యేలా వైజాగ్ లో ఇల్లు కట్టుకుని ఇక్కడే ఉంటా అని చెప్పడం పవన్ ఫ్యాన్స్ కే కాదు.. జగన్ మూడు రాజధానుల నిర్ణయాన్ని వ్యతిరేకించిన ఎవరికీ నచ్చలేదు. కొన్నాళ్ల క్రితం తను ఆ ప్రాంతంలో ప్లేస్ తీసుకున్నానని.. ఈ ప్రాంతం అంటే తనకెంతో ఇష్టమనీ.. ఇక్కడే ఇల్లు కట్టుకుని ఉండిపోవాలని చిరంజీవి చెప్పడం చూస్తే వైజాగ్ ను జగన్ ఓ రేంజ్ లో అభివృద్ధి చేశాడనీ.. రాజధానికి అనుకూలంగా ఉంటుందనే తప్పుడు సంకేతాలు వెళ్లాయి. ఇప్పటికే చిరు వ్యవహారంతో పవన్ కళ్యాణ్‌ అభిమానులకు, మెగా ఫ్యాన్స్ కు మధ్య ఓ గ్యాప్ వచ్చింది. దాన్ని పూడ్చాల్సిన చిరంజీవి రోజు రోజుకూ మరింత పెంచడం వారికి నచ్చడం లేదు.

మూడు రాజధానుల నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తూ.. ప్రజల పక్షాన నిలుస్తోన్న పవన్ కళ్యాణ్‌ సైతం ఈ వ్యాఖ్యలపై అసంతృప్తిగా ఉన్నాడు. ఇక జనసైనికులైతే చిరంజీవిపై ఓ రేంజ్ లో గుర్రుగా ఉన్నారు. ఈ కోపాన్ని రేపు రాబోతోన్న వాల్తేర్ వీరయ్యపై చూపించే అవకాశాలు కూడా ఉన్నాయంటున్నారు చాలామంది. మరి ఈ ఎఫెక్ట్ వాల్తేర్ వీరయ్యపై పడుతుందా లేదా అనేది చెప్పలేం కానీ.. చిరంజీవి తమ్ముడి పోరాటానికి మద్ధతు ఇవ్వకపోయినా ఫర్వాలేదు కానీ.. ఇలా ఆయన పొలిటికల్ ఫైట్ ను నీరుగార్చే వ్యాఖ్యలు చేయకపోతే ఆయన గౌరవం నిలుస్తుందని చాలామంది భావిస్తున్నారు. మరి ఈ వ్యవహారం ఎక్కడి వరకూ వెళుతుందో చూడాలి...

Tags

Read MoreRead Less
Next Story