హాలీవుడ్‌లో ఓపెన్‌హైమర్ పై భారీ అంచనాలు..

హాలీవుడ్‌లో ఓపెన్‌హైమర్ పై భారీ అంచనాలు..
అమెరికన్ ఫిజిసిస్ట్, ప్రపంచంలోనే తొలి అణు బాంబును క్రియేట్ చేసిన రాబర్ట్ ఓపెన్‌హైమర్ జీవితచరిత్ర ఆధారంగా ఈ సినిమా తెరకెక్కింది.

హాలీవుడ్‌లోని మోస్ట్ అవేటెడ్ మూవీస్‌లో ఒకటైన ఓపెన్‌హైమర్ పై భారీ అంచనాలే ఉన్నాయి. అమెరికన్ ఫిజిసిస్ట్, ప్రపంచంలోనే తొలి అణు బాంబును క్రియేట్ చేసిన రాబర్ట్ ఓపెన్‌హైమర్ జీవితచరిత్ర ఆధారంగా ఈ సినిమా తెరకెక్కింది. మొదటి నుంచీ అన్నీ ఫిక్షనల్ స్టోరీలతోనే సినిమాలు చేసిన నోలాన్.. కొన్నేళ్ల కిందట డన్‌కిర్క్ మూవీతో తొలిసారి ఓ నిజ జీవిత కథను ఎంచుకున్నాడు. ఇప్పుడు ఈ సినిమాను కూడా రియల్ స్టోరీని బేస్ చేసుకొని తీశాడు. ట్రైలర్‌నే నోలాన్ ఇంట్రెస్టింగ్‌గా మార్చాడు.ఈ మూవీలో రాబర్ట్ ఓపెన్‌హైమర్ రోల్ లో సిలియన్ మర్ఫీ యాక్ట్ చేశాడు. మాన్‌హాటన్ ప్రాజెక్ట్ లో భాగంగా ఆటం బాంబును క్రియేట్ చేసే మిషన్ ను అతను లీడ్ చేస్తాడు. ఈ బాంబును రెండో ప్రపంచ యుద్ధంలో అమెరికా వాడింది.

హాలీవుడ్‌లోనే కాదు ప్రపంచమంతా మెచ్చే డైరెక్టర్లలో ఒకడు క్రిస్టఫర్ నోలాన్. ఆయన తీసిన ప్రతి మూవీ ఓ అద్భుతమే.క్రిస్టఫర్ నోలాన్ నుంచి గతంలో ఇంటర్‌స్టెల్లార్, ఇన్సెప్షన్, ద ప్రిస్టిజ్, డార్క్ నైట్, టెనెట్ లాంటి సినిమాలు తీశాడు. 2020లో టెనెట్ మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన నోలాన్.. మూడేళ్ల తర్వాత ఈ ఓపెన్‌హైమర్ తో మాయ చేయనున్నాడు. రిచ్ విజువల్స్, మ్యూజిక్ కట్టిపడేయనుంది.ఓపెన్‌హైమర్ మూవీ ప్రపంచవ్యాప్తంగా జులై 21న రిలీజ్ కాబోతోంది.ఇక ఫాదర్ ఆఫ్ అటామిక్ బాంబ్‌గా పేరుగాంచిన జె.రాబర్ట్ ఒప్పెన్‌ హెయిమర్ కథే ఈ సినిమా.

Tags

Read MoreRead Less
Next Story