Vaishali Balsara: కారు బ్యాక్ సీటులో సింగర్ మృతదేహం.. అనుమానాస్పద రీతిలో..

Vaishali Balsara: ఈమధ్య కాలంలో ప్రాణాలు కోల్పోతున్న సినీ సెలబ్రిటీల సంఖ్య పెరిగిపోతోంది. అందులో కొందరు సహజంగా మరణిస్తుంటే.. చాలావరకు అనుమానాస్పద మృతిగా మిగిలిపోతున్నాయి. తాజాగా ఓ ప్రముఖ సింగర్ కూడా తన కారు బ్యాక్ సీటులో విగతజీవిగా కనిపించడం కలకలం సృష్టించింది.
గుజరాత్‌కు చెందిన ఫేమస్ సింగర్ వైశాలి బల్సారా అనుమానాస్పద రీతిలో మృతిచెందింది. వల్సాద్ జిల్లాలోని పార్ నదీ ఒడ్డున ఓ కారు చాలాసేపు ఆగి ఉండడాన్ని స్థానికులు గమనించారు. ఆపై కారు గురించి పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ఘటనాస్థలానికి చేరుకొని కారు డోర్ తెరిచారు.
ఆ కారు బ్యాక్ సీటులో వైశాలి మృతదేహాన్ని చూసి పోలీసులు ఆశ్చర్యపోయారు. అనంతరం మృతదేహాన్ని పోస్టుమార్టంకు పంపించారు. అయితే వైశాలికి హితేశ్ అనే సింగర్‌తో పెళ్లయ్యింది. కాగా శనివారం అర్థరాత్రి తన భార్య కనిపించడం లేదని పోలీసులకు ఫిర్యాదు చేశాడు హితేశ్. ఇంతలోనే తను లేదనే విషయం తన కుటుంబ సభ్యులను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com