Satish Vajra: యువ నటుడి హత్య.. ప్రతీకారంగా బావమరిదే ఇలా..?

Satish Vajra: హత్యలు, ఆత్మహత్యలు అనేవి పెద్ద విషయంగా చాలామంది భావించడం లేదు. అందుకే వీటిపై క్షణికావేశంలో నిర్ణయాలు తీసుకుంటున్నారు. మామూలు ప్రజలే కాదు సినీ సెలబ్రిటీలు కూడా ఈ క్షణికావేశం వల్ల బలవుతున్నారు. ఇటీవల శాండిల్‌వుడ్‌లోని ఓ యువ నటుడి హత్య స్థానికంగా కలకలం సృష్టించింది. బావమరిదే ప్రతీకారం తీర్చుకోవడానికి ఇలా చేశాడంటూ కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు.
కన్నడ సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా పనిచేస్తుంటాడు సతీష్ వజ్ర. ఇటీవల తాను నటించిన 'లగోరి' అనే చిత్రంతో సతీష్‌కు మంచి గుర్తింపు లభించింది. మూడు నెలల క్రితం సతీష్ భార్య ఆత్మహత్య చేసుకుంది. అప్పటినుండి తాను పట్టనగెరెలోని అద్దె ఇంట్లో ఒంటరిగానే ఉంటున్నాడు. ఆ బిల్డింగ్‌లోనే అద్దెకు ఉంటున్న మరో వ్యక్తి.. సతీష్ గది ముందు రక్తపు మరకలు చూసి ఓనర్‌కు చెప్పడంతో హత్య విషయం వెలుగులోకి వచ్చింది.
ఓనర్ ఎంతసేపు తలుపు కొట్టినా తీయకపోవడంతో తన దగ్గర ఉన్న మరో తాళంచెవితో గదిని తెరిచారు. అప్పుడే సతీష్‌ను ఎవరో గొంతుకోసి పలుమార్లు కడుపులో పొడిచి హత్య చేయడం గుర్తించారు. అనంతరం వారు పోలీసులకు సమాచారం అందించారు. సతీష్ వేధింపుల కారణంగానే తన అక్క చనిపోయిందని.. సతీష్ బావమరిది సుదర్శనే ఈ పని చేశాడన్న అనుమానంతో పోలీసులు తనను అదుపులోకి తీసుకున్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com