Kollywood: పాదయాత్రకు సిద్ధమవుతున్న..హీరో విజయ్
కోలివుడ్ స్టార్, హీరో విజయ్ పాదయాత్రకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఈ వార్త తమిళనాట హాట్ టాపిక్‌గా మారింది. సినిమాతో పాటు రాజకీయ రంగంలోనూ ఈ న్యూస్ ప్రకంపనలు సృష్టిస్తోంది. కొన్ని రోజులుగా విజయ్ పొలిటికల్ ఎంట్రీ ఇవ్వనున్నారంటూ మరికొన్ని రోజుల్లో పాదయాత్ర చేయాలని ఆయన నిర్ణయించుకున్నట్లు టాక్ వినబడుతోంది.
ఇటీవల ఈ హీరో 'విజయ్ మక్కల్ ఇయక్కం’ అభిమాన సంఘం సభ్యులతో తరచూ భేటీ అవుతున్నారు. ఈ మేరకు మంగళవారం కూడా వారితో ఓ సమావేశం ఏర్పాటు చేశారని సమాచారం. అందులోనే పాదయాత్రపై నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఆయన నటించిన తాజా చిత్రం ‘లియో’ విడుదల కంటే ముందే తమిళనాడు వ్యాప్తంగా పాదయాత్ర చేయాలనుకుంటున్నారని తెలుస్తోంది. అయితే దీనిపై అధికారిక ప్రకటన వెలువడలేదు. ఇక లియో చిత్రం అక్టోబర్ 19న విడుదల కానుంది.
రీసెంట్‌గా విజయ్ తమిళనాడులోని నియోజకవర్గాల వారీగా టెన్త్, ఇంటర్‌లో అత్యధిక మార్కులు సాధించిన విద్యార్థులను సన్మానించారు. చెన్నై వేదికగా జరిగిన ఈ కార్యక్రమంలో.. విద్యార్థులకు సర్టిఫికేట్స్, నగదు ప్రోత్సాహం అందించి అభినందించారు. ఇవ్వన్నీ చూస్తుంటే ఆయన రాజకీయ రంగ ప్రవేశం ఖాయమనే అనిపిస్తోందంటూ కామెంట్స్ వినిపిస్తున్నాయి. మరోవైపు రానున్న ఎన్నికల్లో ఆయన పోటీచేయనున్నారనే వార్తలు కూడా జోరుగా ప్రచారమవుతున్నాయి.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com