రామ్ సీతా రామ్...

రామ్ సీతా రామ్...
ఆదిపురుష్ సినిమా నుంచి విడుదలైన మరో పాట

డార్లింగ్ ప్రభాస్, కృతి సనన్ జంటగా నటిస్తోన్న ఆదిపురుష్ సినిమాకు సంబంధించిన ఏ చిన్న అప్ డేట్ వచ్చినా ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు. మొదట్లో విపరీతమైన విమర్శలు ఎదుర్కొన్న ఈ సినిమా, ప్రస్తుతం లేటెస్ట్ అప్ డేట్స్ తో అదరగొట్టేస్తోంది. తాజాగా విడుదలైన రామ్ సీతా రామ్ మెలోడీ విడుదలవుతూనే వైరల్ గా మారింది. సీతారాముల మధ్య బంధాన్ని, అనుబంధాన్ని స్తుతిస్తూ సాగిన ఈ రాగం శ్రోతలను ఓలలాడిస్తోంది.


రామజోగయ్య శాస్త్రి అందించిన సాహిత్యానికి సాచెత్ పరంపరా స్వరపరచిన నోట్స్ ప్రేక్షకులను ఆనంద సాగర తీరాలకు తీసుకువెళుతుంది అనడంలో సందేహమే లేదు. స్వచ్ఛమైన ప్రేమకు, అనురాగానికి ప్రతీకగా నిచిలిన సీతారాముల కథను భవిష్యత్తు తరాలకు అందమైన దృశ్యకావ్యంగా మలిచేందుకు చిత్ర బృందం అహర్నిశలూ శ్రమిస్తోందనే చెప్పాలి. టీ-సిరీస్ భూషణ్ కుమార్, కృష్ణ కుమార్ నిర్మాణ సారధ్యంలో తెరకెక్కుతోన్న ఈ చిత్రానికి ఓం రౌత్ దర్శకత్వం వహిస్తోన్న సంగతి తెలిసిందే. ఈ చిత్రం జూన్ 16న ప్రపంచ వ్యాప్తంగా విడుదలవ్వబోతోంది. మరి ఆదిపురుష్ ప్రేక్షకుల అంచనాలను ఏమేరకు అందుకుంటుందో చూడాలి.

Tags

Read MoreRead Less
Next Story