Singer KK: సింగర్ కేకే హఠాన్మరణం.. ప్రముఖుల సంతాపం..
Singer KK: ప్రముఖ బాలీవుడ్ గాయకుడు కృష్ణకుమార్ కున్నాత్ ఆకస్మికంగా కన్నుమూశారు. కేకే పేరుతో ప్రసిద్ధి చెందిన కృష్ణకుమార్ కోల్‌కతాలోని ఓ హోటల్‌లో కుప్పకూలిపోయారు. దీంతో వెంటనే అతడిని స్థానిక హాస్పిటల్‌కు తరలించారు. తర్వాత కేకే చనిపోయినట్లు నిర్ధారించారు డాక్టర్లు. కేకే చనిపోవడానికి ముందు ప్రదర్శన ఇస్తున్న పోస్టులు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
ఢిల్లీలో జన్మించిన కేకే 1999లో బాలీవుడ్ మూవి పాల్ ద్వారా చిత్రసీమకు పరిచయమయ్యారు. తర్వాత అనేక హిట్ సాంగ్స్ పాడారు. తెలుగు,తమిళ, కన్నడ చిత్రాల్లోనూ అనేక హిట్ సాంగ్స్ పాడారు కేకే. కేకే మృతి పట్ల సినీ,రాజకీయ, క్రీడా ప్రముఖులు షాక్‌కు గురయ్యారు. ప్రధాని మోదీ, అమిత్ షా సహా పలువురు ప్రముఖులు సంతాపం ప్రకటించారు. కేకే పాటలు అన్ని వర్గాల వారిని అలరిస్తాయని ట్వీట్ చేశారు మోదీ. కేకే కుటుంబ సభ్యులకు సానుభూతి ప్రకటించారు.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com