Tollywood: రూ.100 కోట్లు.. క్లబ్ కాదు, డార్లింగ్ రేటు...!

Tollywood: రూ.100 కోట్లు.. క్లబ్ కాదు, డార్లింగ్ రేటు...!
భారీ రెమ్యునరేషన్ అందుకుంటోన్న డార్లింగ్; సినిమాకు మినమం.. రూ.120 కోట్లు...

అవును నిజమే...! మన డార్లింగ్ ప్రభాస్ రేంజ్ అలా అలా పెరిగిపోతున్న వైనం చూస్తూనే ఉన్నాం. అతడి కెరీర్ మొత్తాన్ని బాహుబలికి ముందు ఆ తరువాత అన్న చందాన్న విభజించుకోవాలి. ఎందుకంటే... బాహుబలికి ముందు డార్లింగ్ రెమ్యునరేషన్ రూ.20 కోట్లు మాత్రమే..! అప్పట్లో రామ్ చరణ్, ఎన్టీఆర్, అల్లు అర్జున్ లతో పోలచుకుంటే చాలా తక్కువనే చెప్పాలి. ఎప్పుడైతే బాహుబలి రికార్డ్ లను షేక్ చేసిందో... అప్పటి నుంచి డార్లింగ్ రేటు కూడా అమాంతం పెరిగిపోయింది. సినిమాకు 100 కోట్ల అందుకునే రేంజ్ కు ఎదిగిపోయాడు ప్రభాస్. రాథే శ్యామ్ కు ఇదే మొత్తాన్ని రెమ్యునరేషన్ గా అందుకున్న డార్లింగ్, తాజా ప్రాజెక్ట్స్ కు ఫీజు మరింత పెంచేశాడట. తాజాగా రూ.150కోట్లు ముట్టజెప్పితే కానీ, రెబెల్ స్టార్ కాల్షిట్లు అందుకోలేని పరిస్థితులు నెలకొన్నాయి. స్పిరిట్, సలార్, ఆది పురుష్ సినిమాలకు గానూ అబ్బాయి గారు ఇదే మొత్తాన్ని అందుకుంటోన్నట్లు వినికిడి. అదే నిజమైతే టాలీవుడ్ లో అత్యంత భారీ పారితోషకం అందుకుంటోన్న యాక్టర్ గా ప్రభాస్ కొత్త రికార్డ్ సృష్టించినట్లే లెక్క. ఏమైనా... రెబల్ స్టార్ అంటే మినిమం ఆ మాత్రం ఉండటంలో తప్పులేదన్నది అభిమానుల మాట. మరోవైపు ప్రభాస్ మారుతి డైరెక్షన్ లో రాజా డీలక్స్ అనే సినిమా చేస్తోన్న సంగతి తెలిసిందే.

Tags

Read MoreRead Less
Next Story