Vijay: ప్రభాస్ పాటను రీమేక్ చేయనున్న విజయ్.. అప్‌కమింగ్ సినిమాలో..

Vijay: ఇళయదళపతి విజయ్.. సినిమాలు సెలక్ట్ చేసే విషయంలో కానీ, అవి పూర్తి చేసి విడుదల చేసే విషయంలో కానీ ఎప్పుడూ ఆలస్యం చేయడు. అందుకే ఏడాదికి రెండు సినిమాలతో అయినా అభిమానులను అలరించడానికి సిద్ధపడుతుంటాడు. ఇక తాజాగా విజయ్.. వంశీ పైడిపల్లి దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమాతో బిజీగా ఉండగా.. ఈ మూవీపై ఓ ఇంట్రెస్టింగ్ అప్డేట్ బయటికొచ్చింది.
విజయ్, వంశీ పైడిపల్లి కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న చిత్రానికి 'వారసుడు' అనే టైటిల్‌ను ఫిక్స్ చేసిన విషయం తెలిసిందే. ఇటీవల ఈ మూవీ ఫస్ట్ లుక్ పోస్టర్ కూడా విడులదయ్యి మంచి రెస్పాన్స్‌ను అందుకుంది. ఇక ఈ సినిమాలో ప్రభాస్ పాటను రీమేక్ చేయనున్నట్టుగా టాక్ వినిపిస్తోంది. ఈ వార్త బయటికి వచ్చినప్పటి నుండి ప్రభాస్ పాటకు విజయ్ స్టెప్పులూ ఎలా ఉంటుందని ముందే ఊహించడం మొదలుపెట్టారు.
ప్రభాస్ కెరీర్ మొదట్లో నటించిన 'రాఘవేంద్ర' సినిమాలో 'కలకత్తా పానేసినా చూసుకో' అనే పాట ఉంది. ఆ పాటకు సిమ్రాన్‌తో కలిసి స్టెప్పులేశాడు ప్రభాస్. అప్పట్లో ఈ పాట ఒక సెన్సేషన్ క్రియేట్ చేసింది. అసలైతే ఈ పాట విజయ్ నటించిన ఓ తమిళ చిత్రంలోది. అప్పట్లో అది ఫేమస్ అవ్వడంతో రాఘవేంద్ర సినిమాలో కూడా అచ్చం అలాంటి పాటనే క్రియేట్ చేశారు. ఇప్పుడు మరోసారి విజయ్ నటిస్తున్న వారసుడు సినిమా కోసం ఈ పాటను ఉపయోగించనున్నారట మేకర్స్.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com