“ప్రభాస్ ‘ఆదిపురుష్’ మూవీ రివ్యూ ‘Adipurush Movie ’

“ప్రభాస్ ‘ఆదిపురుష్’ మూవీ రివ్యూ ‘Adipurush Movie ’
రాముడు ఆజానుబాహుడు అంటారు. ఆ పాత్రకు ప్రభాస్ ఫిజిక్ కూడా పర్ఫెక్ట్ గా మ్యాచ్ అయినట్లుంది.

Adipurush Movie Review In Telugu :

రామాయణం ఆధారంగా తెలుగుతో పాటు మిగతా బాషల్లోనూ చాలా సినిమాలొచ్చి మెప్పించాయి. కానీ అది చాలా ఏళ్ళ క్రితం. ఈ మధ్య కాలంలో అయితే రాలేదు. అందుకే పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ శ్రీరాముడుగా నటించిన ఆదిపురుష్ చిత్రంపై మొదటి నుంచి దేశవ్యాప్తంగా అంచనాలు ఎక్కువగా ఉన్నాయి. టీజర్ వచ్చినప్పుడు విమర్శలు వచ్చినా.... ట్రైలర్ వచ్చాక ప్రశంసలు దక్కాయి. మొత్తంగా కొద్ది రోజుల నుంచి హాట్ టాపిక్ గా ఉన్న ఆదిపురుష్ వరల్డ్ వైడ్ గా భారీ అంచనాలతో రిలీజైంది. మరి ఈ సినిమా అంచనాలను అందుకుందా...లేదా ? ఈ స్పెషల్ రివ్యూలో చూద్దాం.

ఆదిపురుష్ కథ విషయానికొస్తే...

శ్రీరాముడు... జానకి, శేషుతో కలసి వన వాసానికి వెళ్తాడు. అక్కడ సూర్పణక రాముడ్ని తన భర్తగా ఆహ్వానిస్తుంది. అయితే నేను వివాహితుడిని అని చెప్పి రాముడు వెళ్ళిపోతాడు. దీంతో సీతను చంపడానికి కూడా సూర్పణక ప్రయత్నిస్తుంది. తర్వాత శేషు వేసిన బాణం సూర్పణఖ ముక్కుకు తగులుతుంది. అవమానంతో లంకకు వెళ్ళి అన్నయ్య లంకేశుడుకి తన బాధను తెలిపే క్రమంలో సీత అందం గురించి గొప్పగా వర్ణిస్తుంది. సాధువు వేషధారణలో వెళ్ళిన లంకేశుడు సీతను అపహరించి లంకకు తీసుకొస్తాడు. జానకిని పొందడానికి రాఘవుడు వానర సైన్యంతో కలిసి చేసిన యుద్దం ఎలా ఉంది. ఆ తర్వాత ఏమైందనేదే ఆదిపురుష్ సినిమా.

ఆదిపురుష్ సినిమా రామాయణ గాధ ఆధారంగా రూపొందింది. ఈ కథ మనకు తెలియనిది కాదు. కొన్నేళ్ళ క్రితమే అన్ని బాషల్లో రామాయణపై చాలా సినిమాలు వచ్చి మెప్పించాయి. అయితే ఈ జనరేషన్ వాళ్ళకు పూర్తిగా తెలియకపోవచ్చు. సో...కథ తెలుసిందే కాబట్టి... ఆ కథకు మోడ్రన్ టచ్ ఇచ్చారు మేకర్స్. కథ, కథనాలు, పురాణ ఇతిహాస గ్రంథంలో ఏముంది అనేది పక్కన పెడితే... దర్శకుడు ఓం రౌత్ ఎలా తీశారు అనే విషయానికొస్తే.. విజువల్స్ పరంగా కొత్తగా ఉంది. త్రీడి ఎఫెక్ట్స్ చాలా బాగున్నాయి. ఫస్ట్ హాఫ్ లో బావోద్వేగాల పరంగానూ సూపర్బ్ అనిపించుకుంది. సెకండ్ హాఫ్ లో మాత్రం కొద్దిగా లాగ్ అనిపించిందనే అభిప్రాయం వినిపిస్తోంది. అయితే తెలిసిన కథ అవ్వడం వల్ల కూడా అలా అనిపించి ఉండొచ్చు. ఇంక క్లైమాక్స్ లో వార్ ఎపిసోడ్ నిడివి ఎక్కువగా ఉండి... విజువల్ ఎఫెక్ట్స్ ఎక్కువగా ఉండటంతో బాహుబలిని గుర్తు చేసిందనే కామెంట్స్ కూడా వినిపిస్తున్నాయి. అయితే సినిమా నిడివి మూడు గంటలు. అయినప్పటికీ పాటలు, నేపథ్య సంగీతం ఆ ఫీలింగ్ లేకుండా చేసాయి. విజువల్ ఎఫెక్ట్స్, మ్యూజిక్ వల్ల.. తెరపై వచ్చేవి తెలిసిన సన్నివేశాలే అయినప్పటికీ కొత్త అనుభూతి కలుగుతుంది.

నటీనటుల పెర్ఫార్మెన్స్

రాముడు ఆజానుబాహుడు అంటారు. ఆ పాత్రకు ప్రభాస్ ఫిజిక్ కూడా పర్ఫెక్ట్ గా మ్యాచ్ అయినట్లుంది. శ్రీరాముని పాత్రలో ప్రభాస్ ఒదిగిపోయాడనే కాంప్లిమెంట్స్ వస్తున్నాయి. ఆయన అభినయం, ఆహార్యం ప్రేక్షకులను మెప్పిస్తోంది. తన ఇమేజ్ కూడా సినిమాకి ప్లస్ అయ్యింది. ఇక సీతగా కృతిసనన్ కూడా మెప్పించింది. కనిపించింది తక్కువ సన్నివేశాలే అయినా భావోద్వేగ సన్నివేశాల్లో తన అభినయంతో ఆకట్టుకుంది. ప్రభాస్, కృతిసనన్ మధ్య వచ్చే సన్నివేశాలు సినిమాకి హైలైట్ గా నిలిచాయి. అలాగే లంకేశుడు పాత్రలో సైఫ్ ఆలీఖాన్ లుక్స్ తెలుగు వారికి ఇబ్బందికరంగా ఉండే చాన్స్ ఉంది. పర్ఫార్మెన్స్ పరంగా ఫర్వాలేదు. మిగతా నటీనటులు వారి వారి పాత్రల్లో మెప్పించారు. మ్యూజిక్ డైరెక్టర్లు సంచిత్, అంకిత్ తమ బ్యాగ్రౌండ్ స్కోర్ తో ఆదిపురుష్ కి ప్లస్ గా మారారు.

పురాణ కథకు మోడ్రన్ టచ్ ఇస్తూ తీసిన సినిమా ఆదిపురుష్. ఫస్ట్ హాఫ్ పై ఎలాంటి కంప్లైంట్స్ లేవు. సెకండ్ హాఫ్ లో కొద్దిగా లోపాలున్నా విజువల్ ఎఫెక్ట్స్, బ్యౌగ్రౌండ్ స్కోర్ వాటిని కవర్ చేసేస్తోంది. నటీనటుల పెర్ఫార్మెన్స్ ఆకట్టుకుంటోంది. రామాయణం ఆధారంగా వచ్చిన పాత సినిమాలు చూసిన వారికి థ్రిల్ అనిపించకపోవచ్చు కానీ... ఈ జనరేషన్ ని మెప్పించడం ఖాయం. ఇక త్రీడి వెర్షన్ కి అయితే చిన్న పిల్లల నుంచి అదిరిపోయే రెస్పాన్స్ వస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు. మొత్తంగా ఆదిపురుష్ కి హిట్ టాక్ వచ్చింది. ఇప్పటికే అడ్వాన్స్ బుక్కింగ్స్ తో రికార్డులు సృష్టిస్తోన్ని ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర భారీ ఓపెనింగ్స్ తెచ్చుకోబోతుంది. ఓవరాల్ గాను టాప్ గ్రాసర్స్ లిస్ట్ లో నిలవబోతుందంటున్నాయి ట్రేడ్ వర్గాలు.

రేటింగ్స్-రామాయణానికి మోడ్రన్ టచ్

BY_డి.ఉదయ్ కుమార్

Tags

Read MoreRead Less
Next Story