TG : ప్రభుత్వ ఉద్యోగులకు ఆశీర్వాద ఖర్చులు రూ.30వేలకు పెంపు

TG : ప్రభుత్వ ఉద్యోగులకు ఆశీర్వాద ఖర్చులు రూ.30వేలకు పెంపు
X

తెలంగాణ రాష్ట్రంలోని రేవంత్ రెడ్డి సర్కార్ ప్రభుత్వ ఉద్యోగుల కోసం మరో కీలక ప్రకటన చేసింది. ఉద్యోగ ఫ్రెండ్లీ సర్కార్ గా ఉంటూ, ఉద్యోగ వర్గాలకు మేలు చేసే చర్యలకు కాంగ్రెస్ నేతృత్వంలోని ప్రజా ప్రభుత్వం శ్రీకారం చుడుతోంది. ఈ క్రమంలో తాజాగా ప్రభుత్వ ఉద్యోగులకు మర ణానంతరం ఆశీర్వాద ఖర్చులకు ఇచ్చే మొత్తాన్ని 50 శాతం పెంచింది. పీఆర్సీ సూచన మేరకు ప్రభుత్వ ఉద్యోగికి మరణాంతరం అంత్యక్రియలకు ఇచ్చే నగదు సహాయాన్ని రూ.20,000నుంచి రూ. 30,000 వేలకు పెంచింది. ఈ మేరకు సోమవారం జీవో విడుదల చేసినట్లు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి తెలియజేశారు. సర్వీస్ ఉండి మృతి చెందిన ఉద్యోగుల అంత్యక్రియల ఖర్చును రూ.30వేలకు పెంచుతూ జీవో 247ను జారీ చేశారు. ప్రభుత్వం తీసుకున్న తాజా నిర్ణయంపై ఉద్యోగులు హర్షం వ్యక్తం చేశారు. రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపించేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్న రేవంత్ ప్రభుత్వం, ప్రభుత్వ ఉద్యోగుల సమస్యల పరిష్కారానికీ చొరవ చూపుతోంది. ఇప్పటికే ఉద్యోగులతో భేటీ అయిన సీఎం రేవంత్, మంత్రులు సమస్యలను అడిగి తెలు సుకున్నారు

Tags

Next Story