Raja Saab Movie Review : రాజా సాబ్ మూవీ రివ్యూ

Raja Saab Movie Review :  రాజా సాబ్ మూవీ రివ్యూ
X

రివ్యూ : రాజా సాబ్

తారాగణం : ప్రభాస్, సంజయ్ దత్, జరీనా వాహబ్, నిధి అగర్వాల్, మాళవిక మోహనన్, రిద్ది కుమార్ తదితరులు

ఎడిటింగ్ : కోటగిరి వెంకటేశ్వరరావు

సంగీతం : తమన్ ఎస్

సినిమాటోగ్రఫీ : కార్తీక్ పలని

నిర్మాతలు : టి.జి. విశ్వ ప్రసాద్, వివేక్ కూటిబొట్ల, ఇషాన్ సక్సేనా

దర్శకత్వం : మారుతి

మూడేళ్లుగా ఒక సినిమా చేయడం అనేది ఈ మధ్య కామన్. స్టార్ హీరోలతో అయితే అది మామూలే. మారుతి దర్శకత్వంలో ప్యాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా రూపొందిన మూవీ కూడా అలాంటిదే. ప్రమోషన్స్ పరంగా వీక్ గా ఉన్న ఈ మూవీ ఇవాళ విడుదలైంది. మరి ఈ సినిమా ఎలా ఉంది అనేది ఈ రివ్యూలో చూద్దాం.

కథ :

రాజు(ప్రభాస్) ఓ సాధారణమైన కుర్రాడు. అతనికి నాయనమ్మ గంగమ్మ (జరీనా వాహబ్) ఉంటుంది. ఆమె చాలా ఏళ్ల క్రితం తన పెళ్లి తర్వాత వెళ్లిపోయిన కనక రాజు (సంజయ్ దత్ ) గురించి కలవరపడుతూ ఉంటుంది. అతను బ్రతికే ఉంటాడు అనిపించేలా పుస్తెల తాడు కూడా ఉంటుంది. ఓ సారి అతను ఆమె కలలో కనిపించి అతన్ని కలుస్తాను అని చెబుతాడు. దీంతో పాటు హైదరాబాద్ లో ఓ ఫోటోలో కనిపిస్తాడు. దీంతో తాతను వెదుక్కుంటూ హైదరాబాద్ కు వెళతాడు రాజు. అంతకు ముందే అతనో అమ్మాయి(రిద్ది కుమార్) తో స్నేహంగా ఉంటాడు. హైదరాబాద్ కు వెళ్లిన తర్వాత మరో అమ్మాయి(నిధి అగర్వాల్)తో ప్రేమలో పడతాడు. మరో అమ్మాయి(మాళివిక) అతన్ని తన వలలో లాగేసుకుంటుంది. ఈ క్రమంలో తాత కనకరాజు గురించి వెదికే ప్రయత్నంలో అతను ఓ గొప్ప మిలియనీర్ అని తెలుస్తుంది. అదీ కాక అతనో మాంత్రికుడు అను తెలుస్తుంది. అంతే కాదు.. అతన్ను అతని నాయనమ్మను చంపేయాలనుకుంటాడు అని తెలుసుకుంటాడు. ఇందులో భాగంగా రాజుతో పాటు అతని పర్సనల్ జనం అందరినీ ఓ మాయా మహల్ లో బంధిస్తాడు. మరి ఆ కనక రాజు ముసలమ్మను ఎందుకు చంపాలనుకుంటాడు.. అతని ఆస్తిని మనవడుకు ఎందుకు ఇవ్వాలనుకోడు అనేది మిగతా కథ.

ఎలా ఉంది ?

ఇదో హారర్ కామెడీ మూవీలా కనిపిస్తుంది. అదే టైమ్ లో హిప్నాజిటం కూడా యాడ్ అయి ఉంటుంది. హారర్, హిప్నాటిజం మిక్స్ చేసి ఈ కథను రాసుకున్న కథ ఇది. బట్ ఆ రెండు అంశాలూ స్పష్టంగా లేకపోవడం, రెండు అంశాల్లోనూ క్లారిటీ లేకపోవడం మాత్రం ప్రధాన లోపంగా కనిపిస్తుంది. ఫస్ట్ హాఫ్ అంతా ఏదో సరదా సరదాగా సాగినట్టుగా కనిపిస్తుంది. రిపీటెడ్ సీన్స్ ఉంటాయి. అవసరం లేని ఫైట్లు కనిపిస్తాయి. బలవంతపు రొమాన్స్ ఇరికించినట్టు కనిపిస్తుంది. సంజయ్ దత్ ఎంట్రీ తర్వాత నెక్ట్స్ లెవల్ కు వెళుతుంది సెకండ్ హాఫ్ లో అనిపిస్తుంది. బట్ ఈ విషయంలో పూర్తిగా గాడి తప్పింది కథనం. ముఖ్యంగా ఒక హంటెడ్ హౌజ్ లోకి ఎంటర్ అయిన మెయిన్ టీమ్ రకరకాల సన్నివేశాలతో సాగుతుంది. అవీ ఏమంత ఆకట్టుకునేలా ఉండవు. ముఖ్యంగా ఆ ఇంట్లో వాళ్లంతా చిక్కుకుపోతారు. కానీ ఎవరూ భయపడరు. కనీసం కొత్తగా ఉండే ప్రయత్నం చేయరు. అదీ కాక తామంతా ఏదో వెకేషన్ కు వచ్చినట్టుగా కనిపించడం మాత్రం కథనం పరంగా చాలా పెద్ద మైనస్ లా అనిపిస్తుంది.

సంజయ్ దత్ హిప్నాటిజం సీన్ మొత్తం లాగ్ అయినట్టుగా కనిపిస్తుంది. ఆ సీన్స్ కూడా ఏమంత ఆకట్టుకునేలా ఉండవు. హిప్నాటిజంకు సంబంధించిన బ్యాక్ ఎండ్ స్టోరీ ఏదైనా ఉండి ఉంటే ఇంకా బెటర్ గా ఉండే బావుండేది. అలాగే సంజయ్ దత్ వయసులో ఉండగా నేర్చుకున్న మాయలు కూడా ఆకట్టుకునేలా ఉండవు. మొత్తంగా బొమన్ ఇరానీ ఎపిసోడ్ మాత్రం బావుంది. అతని క్యారెక్టర్ వల్ల కొంత సెకండ్ హాఫ్ లో చివరి 20 నిమిషాల బావున్నట్టుగా కనిపిస్తుంది. బట్ అప్పటికే అతని పాత్ర తప్పుకుంటుంది. ఓవరాల్ గా చూస్తే ప్రభాస్ నవరసాలు పలికించినట్టుగా ఉన్న సన్నివేశాలు కూడా సోసో గా ఉన్నాయి. కథన పరంగా ఏ మాత్రం ఆకట్టుకోలేకపోయిన సినిమాగా అనిపిస్తుంది.

నటన పరంగా ప్రభాస్ నటన బావుంది. డైలాగ్ డెలివరీ మాత్రం కాస్త ఇబ్బందిగా అనిపిస్తుంది. సంజయ్ దత్ పాత్ర ఏమంత గొప్పగా లేదు. నటనా కూడా అంతంతే ఉంది. జరీనా వాహబ్ పాత్ర చాలా పెద్దగా ఉంది. బట్ అంత ఇంపాక్ట్ మాత్రం కనిపించదు. బొమన్ ఇరానీ పాత్ర, నటన బావుంది. సత్య, ప్రభాస్ శ్రీను, సప్తగిరి నవ్వించలేపోయారు. హీరోయిన్ల పాత్రలన్నీ కేవలం స్కినో షోకే పరిమితమైనట్టుగా ఉన్నాయి. ఇతర పాత్రలన్నీ రొటీన్ గానే ఉన్నాయి.

టెక్నికల్ గా తమన్ నేపథ్య సంగీతం మిక్స్ డ్ గా ఉంది. సెకండ్ హాఫ్ చివరి 20 నిమిషాల్లో అద్భుతంగా ఉంది. మిగతా అంతా ఓకే అనిపించాడు. పాటలు బాలేదు. సినిమాటోగ్రఫీ బావుంది. ఎడిటింగ్ 15నిమిషాలు ట్రిమ్ చేసినా నష్టం లేదు. విఎఫ్ఎక్స్, గ్రాఫిక్స్ బావున్నాయి. నిర్మాణ విలువలు బావున్నాయి. డైలాగ్స్ సోసో గా ఉన్నాయి. దర్శకత్వ పరంగా మారుతి పూర్తిగా తేలిపోయాడు. రైటింగ్ చాలా వీక్ గా ఉంది. టేకింగ్ పరంగా తేలిపోయాడు. ఈ రేంజ్ సినిమాలకు అతని రేంజ్ చాలా చాలా పెద్దది అనిపించాడు. అతనో విఫల ప్రయత్నం చేసినట్టుగా కనిపిస్తుంది.

ఫైనల్ గా : కష్టం సాబ్

రేటింగ్ : 2.5/5

బాబురావు కామళ్ల


Tags

Next Story