Maharashtra : కుప్పకూలిన గోడౌన్.. శిథిలాల కింద బాధితులు

మహారాష్ట్రలోని థానే జిల్లా భివాండిలో రెండంతస్తుల గోడౌన్ కుప్పకూలింది. ఈ ఘటన శనివారం జరిగింది. గోడౌన్ కూలడంతో దాని పక్కనే నివసిస్తున్న వాళ్లు, అందులో పనిచేస్తున్నవాళ్లు శిథిలాల కింద చిక్కుకున్నారు. ఘటనా స్థలానికి రెస్క్యూ టీం, పోలీసులు చేరుకున్నారు. సహాయక చర్యలను ప్రారంభించారు. ప్రాంతీయ విపత్తు నిర్వహణ విభాగం చీఫ్ అవినాష్ సావంత్ సంఘటన జరిగిన మంకోలిలోని వల్పాడ ప్రాంతాన్ని సందర్శించారు. రెస్క్యూ కార్యకలాపాలను ప్రారంభించినట్లు తెలిపారు.
గోడౌన్ కాంపౌండ్‌లోని గ్రౌండ్ ప్లస్ రెండు అంతస్తుల భవనం శనివారం మధ్యాహ్నం 1.45 గంటలకు కుప్పకూలింది. పై అంతస్తులో నాలుగు కుటుంబాలు నివసిస్తుండగా, కింది అంతస్తులో కూలీలు పనిచేస్తున్నట్లు అధికారులు తెలిపారు. భివాండి, థానేతో పాటు ఇతర సమీప ప్రాంతాల నుంచి అగ్నిమాపక యంత్రాలు రెస్క్యూ టీం అదనంగా మోహరించబడినట్లు చెప్పారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com