భారతీయులకు అమెరికా శుభవార్త.. 10 లక్షలకు పైగా వీసాలకు గ్రీన్ సిగ్నల్

భారతీయులకు అగ్రరాజ్యం అమెరికా శుభవార్త చెప్పింది. 2023 ఏడాదికి భారతీయులకు రికార్డు స్థాయిలో 10 లక్షలకు పైగా వీసాలను జారీ చేసేందుకు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. అలాగే విద్యా సంవత్సరం ప్రారంభం నాటికే భారతీయ విద్యార్థులందరికీ స్టూడెంట్ వీసాల ఆమోద ప్రక్రియను పూర్తి చేస్తామని అమెరికా విదేశాంగ శాఖ వెల్లడించింది. భారతీయులు అధికంగా కోరుకునే హెచ్-1బీ, ఎల్ వర్క్ వీసాల జారీకి పచ్చజెండా ఊపింది.
అమెరికాకు చదువుల కోసం వెళ్తున్న విదేశీ విద్యార్థుల్లో భారతీయులు రెండోస్థానంలో ఉన్నారని అమెరికా విదేశాంగ శాఖలో సహాయ కార్యదర్శి డొనాల్డ్‌లు అన్నారు. భారత్, అమెరికాల ఆర్థిక వ్యవస్థలకు కీలకమైన వర్క్ వీసాలకు తాము ప్రాధాన్యం ఇస్తున్నామని తెలిపారు. కొన్ని నాన్ ఇమ్మిగ్రెంట్ వీసాల రెన్యువల్‌కు పిటిషన్‌దారు స్వయంగా హాజరు కావాల్సి ఉందన్నారు. అయితే అలాంటి వాటిని దేశీయంగానే పునరుద్ధరించే ప్రక్రియను ఈ ఏడాది చివర్లో ప్రయోగాత్మకంగా తిరిగి అమలు చేయాలని నిర్ణయించినట్లు చెప్పారు. హెచ్-1బీ వీసాలు ఉండీ ఉద్యోగాలు కోల్పోయిన ఐటీ నిపుణులు తమ హోదాను పునరుద్ధరించుకోవడానికి తామేం చేయాలో సూచిస్తూ అమెరికన్ హోంల్యాండ్ సెక్యూరిటీ విధివిధానాలను విడుదల చేసిందన్నారు. ప్రస్తుతం లక్ష మంది వరకు అమెరికన్లు భారత్‌లోనూ నివసిస్తున్నారని డొనాల్డ్‌లు వివరించారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com