జనాభాలో చైనాను అధిగమించనున్న భారత్ : ఐక్యరాజ్యసమితి

ఈ ఏడాది మధ్యలో అత్యధిక జనాభా కలిగిన దేశంగా భారత్ అవతరించనుందని ఐక్యరాజ్యసమితి బుధవారం వెల్లడించింది. భారత దేశ జనాభా 1,428.6 మిలియన్లు, చైనా 1.4257 మిలియన్ల జనాభా కలిగి ఉండనుందని తెలిపింది. మూడవ స్థానంలో యునైటెడ్ స్టేట్స్ 340 మిలియన్ల జనభాతో మూడవస్థానంలో ఉన్నట్లు పేర్కొంది. అయితే అత్యధిక జనాభా గల దేశంగా భారత్ ఏ తేదీన అవతరించనుందో తెలుపలేదు. అందుకు కారణం సరైన నివేదికలు లేకపోవడమే. భారత్ లో 2011లో జనాభా లెక్కలు చేపట్టారు. తిరిగి 2021లో జనాభా లెక్కలు చేపట్టాల్సి ఉండగా కరోనా కారణంగా ఆలస్యం అయింది.
గతకొంతకాలంగా భారత్, చైనాలో జనాభా పెరుగుదల మందగిస్తున్నట్లు ఐక్యరాజ్య సమితి పేర్కొంది. 2022 లో చైనా జనాభా ఆరు దశాబ్దాలలో మొదటిసారిగా పడిపోయింది, ఇది ఒక చారిత్రాత్మక మలుపుగా భావిస్తున్నారు. 10 సంవత్సరాల క్రితం 1.7%తో పోలిస్తే 2011 నుంచి భారతదేశ వార్షిక జనాభా పెరుగుదల సగటున 1.2% ఉంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com