వాహనదారులకు శుభవార్త? దిగి రానున్న పెట్రోల్, డిజిల్ ధరలు

వాహనదారులకు శుభవార్త అందబోతోందా.. ఎప్పుడూ పైపైకి ఎగిరే పెట్రోల్ డీజిల్ ధరలు ఈసారి కాస్త నేలకు దిగి వస్తాయా.. ఇందుకు అవుననే సమాధానం వస్తోంది. ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు పెట్రోల్ మరియు డీజిల్ ధరలను తగ్గించే అవకాశం ఉందని విశ్వసనీయ వర్గాల సమాచారం. కంపెనీలు తమ నష్టాలనుంచి దాదాపుగా కోలుకొని ప్రస్తుతం సాధారణ స్థితికి చేరుకున్న నేపథ్యంలో పెట్రోలు మరియు డీజిల్ ధరలను తగ్గించే సూచనలు కనిపిస్తున్నాయి.
నిజానికి గత కొంతకాలంగా వీటి ధరలు స్థిరంగా ఉన్నాయి. సాధారణంగా ముడి చమురు ధరలు పెరగడం లేక తగ్గడం అనేది నిరంతరం జరుగుతుంది. కానీ వాటి ఆధారంగా నిర్ణయించబడే పెట్రోల్, డీజిల్ ధరలలో మాత్రం చాలాకాలంగా ఎలాంటి మార్పు చోటు చేసుకోలేదు. ఇప్పుడు మాత్రం స్థిరంగా ఉన్న ఆ రేట్లలో కదలిక రాబోతోంది. ప్రస్తుతం ఉన్న ధరలను తగ్గించాలని ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు నిర్ణయించినట్టుగా తెలుస్తోంది. కొన్నాళ్ళుగా నష్టాలలో ఉన్న ఆయిల్ కంపెనీలు ఇప్పుడిప్పుడే లాభాల బాట పడ్డాయి.
ఇటీవల ప్రకటించిన త్రైమాసిక ఫలితాల్లో ఆయిల్ కంపెనీలు తమ నష్టాలు భారీగా తగ్గినట్టు ప్రకటించాయి. వస్తున్న లాభాల దృష్ట్యా పెట్రోల్ డీజిల్ రేట్లను తగ్గించాలని నిర్ణయించినట్లుగా ప్రభుత్వ వర్గాల సమాచారం.
నిజానికి అంతర్జాతీయ చమూరు ధరలకు అనుగుణంగా పెట్రోలు డీజిల్ ధరలు పెరగటం తగ్గటం ఉంటుంది. అయితే సుమారు ఏడాది కాలంగా ధరలు పూర్తిగా స్థిరంగా ఉన్నాయి.
అంతర్జాతీయ చమరు ధరలలో మార్పులు వచ్చినప్పటికీ ఆయిల్ కంపెనీలు ధరలను ఏమాత్రం మార్చలేదు ఈ కారణంతోనే ఆయిల్ కంపెనీలు నష్టాలను పూడుచుకొని లాభాల బాట పట్టాయి. ఇప్పుడు ఈ లాభాలను వినియోగదారులకు అందజేయాలని ఆలోచనలు చేస్తున్నట్టుగా తెలుస్తోంది. అయితే ధరలు ఎప్పటినుండి తగ్గుతుంది అన్న విషయం మీద మాత్రం స్పష్టమైన ప్రకటన రాలేదు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com