నదిలో పడిన మాజీ మేయర్ కుమారుడి కారు.. ప్రమాదం జరిగిన 9 రోజుల తర్వాత..

నదిలో పడిన మాజీ మేయర్ కుమారుడి కారు.. ప్రమాదం జరిగిన 9 రోజుల తర్వాత..
ప్రమాదం జరిగిన 9 రోజుల తర్వాత చెన్నై మాజీ మేయర్ కుమారుడి మృతదేహం సట్లెజ్ నది నుంచి బయటకు వెలికి తీశారు.

ప్రమాదం జరిగిన 9 రోజుల తర్వాత చెన్నై మాజీ మేయర్ కుమారుడి మృతదేహం సట్లెజ్ నది నుంచి బయటకు వెలికి తీశారు. తమిళ సినీ దర్శకుడు, చెన్నై మాజీ మేయర్ కుమారుడు వెట్రి దురైసామి ప్రయాణిస్తున్న కారు ప్రమాదవశాత్తు సట్లెజ్ నదిలో పడిపోయింది. తొమ్మిది రోజుల తర్వాత అతడి మృతదేహం లభ్యమైంది.

' ఎంద్రావతు ఒరు నాల్ ' అనే తమిళ సినిమా దర్శకుడు వెట్రి దురైసామి ఫిబ్రవరి 4న సిమ్లా నుండి స్పితికి వెళుతుండగా అతని వాహనం ప్రమాదానికి గురైంది. అప్పటి నుండి 9 రోజులుగా కనిపించకుండా పోయాడు.

సహ ప్రయాణికుడు గోపీనాథ్ రక్షించబడి చికిత్స పొందుతుండగా, కారు డ్రైవర్ టెన్జిన్ చనిపోయాడు. అయితే 45 ఏళ్ల వెట్రి ఆచూకీ తెలియలేదు. తన కొడుకు రక్షించబడతాడని ఆశించిన సైదై దురైసామి వెట్రి ఆచూకీ తెలిపిన వారికి కోటి రూపాయల రివార్డును కూడా ప్రకటించారు.

పోలీసు అధికారులు నది ఒడ్డున మానవ మెదడు పదార్థం యొక్క జాడలను కనుగొన్నారు. అవి వెట్రికి చెందినవో కాదో అని నిర్ధారించడానికి DNA పరీక్షను నిర్వహించారు.

ఇండో-టిబెటన్ బోర్డర్ పోలీస్ (ITBP), నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ (NDRF), స్టేట్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫండ్ (SDRF) ఉత్తరాఖండ్ జిల్లా పోలీసు అధికారులతో సహా పలు బృందాలు వెట్రి దురైసామి కోసం గాలింపు చర్యలు చేపట్టాయి.

ప్రమాదం జరిగిన ప్రాంతానికి 3 కిలోమీటర్ల దూరంలో మహిన్ నాగ్ అసోసియేషన్‌కు చెందిన డైవర్ల బృందం సోమవారం వెట్రి మృతదేహాన్ని గుర్తించింది. కుటుంబ సభ్యులకు అప్పగించే ముందు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం సిమ్లాలోని ఇందిరా గాంధీ మెడికల్ కాలేజీ అండ్ హాస్పిటల్ (ఐజీసీఎంహెచ్)కి తరలించారు.

తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ సైదై దురైసామికి తన సంతాపాన్ని తెలియజేశారు. ఏ తండ్రికీ ఇలాంటి కష్టం రాకూడదని స్ఠాలిన్ ఆవేదన చెందుతూ అన్నారు.

Tags

Read MoreRead Less
Next Story