Gujarat: గర్బా నృత్యం చేస్తూ గుండెపోటుతో 10 మంది మృతి

కరోనా తర్వాత దేశంలో గుండెపోటుతో మరణించే వారి సంఖ్య భారీగా పెరుగుతోంది. మాట్లాడుతూ.. ఆటలాడుతూ.. పనిచేస్తూ కూర్చొన్న మనిషి కూర్చొన్న చోటే కుప్పకూలిపోతున్నాడు. ముఖ్యంగా 30 ఏళ్ల లోపు యువత ఎక్కువగా గుండెపోటుతో మరణిస్తూ ఉండటంతో నిపుణులు సైతం ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.గుజరాత్‌లో నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా గర్బా నృత్యం చేస్తూ పలువురు గుండెపోటుకు గురవ్వడం ఆందోళన కలిగిస్తోంది. గడచిన 24 గంటల్లో ఏకంగా 10 మంది ప్రాణాలు కోల్పోవడం కలకలం రేపుతోంది. బాధితుల్లో యువత, మధ్య వయసు వారు ఉండడం ఆందోళన కలిగిస్తోంది. మరణించినవారిలో బరోడాలోని దభోయ్‌కు చెందిన 13 ఏళ్ల బాలుడు కూడా ఉండడం అందరినీ విస్మయానికి గురిచేస్తోంది.
నవరాత్రులు ప్రారంభమైన తొలి ఆరు రోజులలో 108 అంబులెన్స్ సేవలకు గుండె సంబంధిత సమస్యలపై 521 కాల్స్, శ్వాస ఆడటం లేదంటూ 690 కాల్స్ వచ్చాయి. ఇవన్నీ కూడా సాధారణంగా గర్భా వేడుకలు జరిగే సాయంత్రం 6 నుంచి తెల్లవారుజాము 2 గంటల మధ్య రికార్డ్ చేయబడ్డాయి. ఈ ఆందోళనకర పరిస్థితుల నేపథ్యంలో ఈవెంట్ నిర్వాహకులు చర్యలు తీసుకోవాల్సిందిగా ప్రభుత్వం ఆదేశించింది. గర్భా వేదికల సమీపంలోని అన్ని ప్రభుత్వ ఆసుపత్రులు, కమ్యూనిటీ హెల్స్ సెంటర్స్ అప్రమత్తంగా వుండాలని గుజరాత్ ప్రభుత్వం ఆదేశించింది. అత్యవసర పరిస్థితుల్లో ఈవెంట్‌లలోకి అంబులెన్స్‌లు వేగంగా ప్రవేశించేందుకు కారిడార్‌లను రూపొందించాలని గర్భా నిర్వాహకులను కూడా ఆదేశించింది.
రాష్ట్రంలో గడిచిన కొన్ని రోజులుగా ఇలాంటి కేసులు వరుసగా నమోదయ్యాయి. అహ్మదాబాద్‌కు చెందిన 24 ఏళ్ల యువకుడు గర్బా ఆడుతూ హఠాత్తుగా కుప్పకూలి కన్నుమూశాడు. ఇక కపద్వాంజ్‌కు చెందిన 17 ఏళ్ల బాలుడు కూడా ఇదే విధంగా చనిపోయాడు. నవరాత్రుల మొదటి 6 రోజులలో గుండె సంబంధిత సమస్యలకు సంబంధించి 108 అంబులెన్స్ సర్వీసులకు ఏకంగా 521 కాల్స్ వచ్చాయంటే అక్కడి పరిస్థితి ఏవిధంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇక శ్వాస ఆడకపోవడానికి సంబంధించి 609 కాల్స్ వచ్చాయని, గర్బా వేడుకలు జరిగే సమయం సాయంత్రం 6 మరియు తెల్లవారుజామున 2 గంటల మధ్యలోనే ఈ కాల్స్ వచ్చాయని అధికారులు వివరించారు.
పరిస్థితి ఆందోళనకరంగా ఉండడంతో ప్రభుత్వంతోపాటు ఈవెంట్ నిర్వాహకులు చర్యలు తీసుకోవాలని వైద్యాధికారులు సూచిస్తున్నారు. ఈ మేరకు ప్రభుత్వం స్పందించింది. గర్బా వేడుకల సమీపంలోని అన్ని ప్రభుత్వ ఆసుపత్రులు, కమ్యూనిటీ హెల్త్ సెంటర్‌లు హైఅలర్ట్‌గా ఉండాలని ప్రభుత్వం కోరింది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com