Manmohan Singh : 10 ఏళ్లు ప్రధాని.. రెండు ఫ్లాట్లు, మారుతి 800 కారు

మన్మోహన్ సింగ్ వ్యక్తిగతంగా, రాజకీయంగా ఎంతో నిజాయితీ, నిరాడంబర జీవితాన్ని గడిపారు. మచ్చలేని వ్యక్తిత్వంతో ప్రత్యర్థుల మన్ననలు సైతం పొందారు. ప్రజా జీవితంలో పాటించాల్సిన విలువలకు ఆయన నిదర్శనంగా నిలిచారు. ఎవరిపైనా చిన్న దూషణ, తప్పుడు ఆరోపణలు చేయలేదు. ఆర్థిక, పాలనా అంశాల్లో సమగ్రమైన అవగాహనతో ఆయన పార్లమెంట్ సహా పలు వేదికల్లో చేసిన ప్రసంగాలు ఎంతో మందికి పాఠ్యపుస్తకాల్లాంటివి.
తనకు రూ.15.77 కోట్ల విలువైన ఆస్తులు ఉన్నాయని మన్మోహన్ సింగ్ 2018లో రాజ్యసభ సీటుకు నామినేషన్ సందర్భంగా వెల్లడించారు. ఢిల్లీ, చండీగఢ్‌లో రెండు ఫ్లాట్లు, మారుతి 800 కారు, SBI, పోస్టల్ బ్యాంకులో డిపాజిట్లు ఉన్నాయని అఫిడవిట్ సమర్పించారు. ఎలాంటి అప్పులు లేవని పేర్కొనడం మన్మోహన్ ఆర్థిక క్రమశిక్షణకు నిదర్శనం.
ఇప్పుడు ఏ రాష్ట్రంలో ఎన్నికలు జరిగినా రైతు రుణమాఫీ అనేది కామన్ హామీగా మారిపోయింది. అయితే ఈ పథకానికి ఆద్యుడు మన్మోహన్ సింగ్. 2008లో యూపీఏ ప్రభుత్వం దేశవ్యాప్తంగా 3 కోట్ల మంది రైతులకు రూ.72,000 కోట్ల రుణమాఫీ చేసింది. ఆ డేరింగ్ నిర్ణయం కారణంగానే యూపీఏ రెండోసారి అధికారంలోకి వచ్చింది. దాన్ని స్ఫూర్తిగా తీసుకుని చాలా పార్టీలు ఎన్నికల్లో గెలుస్తున్నాయి.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com