Jyoti Malhotra Phones : జ్యోతిమల్హోత్రా ఫోన్ల నుంచి 12టెరా బైట్ల డేటా రికవరీ

గూఢచర్యం కేసులో అరెస్టయిన హర్యానాకు చెందిన యూట్యూబర్ జ్యోతి మల్హోత్రా వ్యవహారంలో దర్యాప్తు ముమ్మరంగా సాగుతోంది. ఇప్పటికే ఆమె ఫోన్లు, ల్యాప్ టాప్ ను స్వాధీనం చేసుకున్న అధికారులు, వాటిలో డిలీట్ అయిన సమాచారాన్ని రికవరీ చేస్తున్నారు. దాదాపు 12 టెరా బైట్ల డేటాను రికవరీ చేసినట్లు తెలిసింది. 'జ్యోతి మల్హోత్రాకు చెందిన మూడు ఫోన్ల నుంచి 12 టెరా బైట్ల డేటాను స్వాధీనం చేసుకున్నాం. రికవరీ చేసిన డిజిటల్ డేటాను పరిశీలిస్తున్నాము. ఆమె ల్యాప్టాప్ లోని డేటాను ఇంకా పరిశీలించాల్సి ఉంది' అని సీనియర్ పోలీసు అధికారిని ఉటంకిస్తూ జాతీయ మీడియా పేర్కొంది. అదేవిధంగా జ్యోతి మల్హోత్రా నాలుగురు పాకిస్థానీ నిఘా ఏజెంట్లతో నేరుగా సంప్రదింపులు జరిపినట్లు కూడా తేలింది. వీరిలో ఢిల్లీలోని పాక్ హైకమిషన్ ను సందర్శించినప్పుడు పరిచయమైన డానిష్, అహ్సాన్, షాహిద్ ఉన్నారు. దీంతో పాక్ భద్రతా సంస్థలో వీరి పాత్ర గురించి అధికారులు తెలుసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com