Road Accident: కర్ణాటకలో ఘోర రోడ్డు ప్రమాదం

Road Accident: కర్ణాటకలో  ఘోర రోడ్డు ప్రమాదం
ఏపీకి చెందిన 13 మంది మృతి

కర్ణాటకలో గురువారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. ఉదయాన్నే వేగంగా దూసుకువచ్చిన టాటా సుమో అదుపు తప్పి రోడ్డుపై ఆగిఉన్న ట్యాంకర్‌ లారీని ఢీ కొట్టింది. చిక్కబళ్లాపూర్ వద్ద జరిగిన ఈ ప్రమాదంలో ఆంధ్రప్రదేశ్‌లోని సత్యసాయి జిల్లా గోరంట్ల మండలానికి చెందిన 13 మంది మృతిచెందారు. దట్టంగా కురుస్తోన్న పొంగ మంచు కారణంగానే ప్రమాదం జరిగినట్టు తెలుస్తోంది. 44వ నెంబరు జాతీయ రహదారిపై జరిగిన ఈ సమాచారం గురించి సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకున్నారు. గాయపడిన వారిని చికిత్స కోసం ఆస్పత్రికి తరలించారు. ప్రమాద సమయానికి టాటా సుమోలో మొత్తం 18 మంది ఉన్నట్లు అధికారులు తెలిపారు. భారీగా మంచు ఉండడంతో రోడ్డు ముందు వాహనాలు కనిపించకపోవటం వలన ప్రమాదం జరిగి ఉండవచ్చు అని ప్రాధిమిక నిర్ధారణకు వచ్చారు. ఏపీ సరిహద్దుకు 40 కిలోమీటర్ల దూరంలోనే ఈ ప్రమాదం జరిగింది.


క్షతగాత్రుల్లో మరో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు చెప్పారు. ప్రమాదానికి గురైన వాహనంపై ఆంధ్రప్రదేశ్ రిజిస్ట్రేషన్‌తో ఉందని, మృతులంతా ఏపీకి చెందిన వారుగా పోలీసులు తెలిపారు. సత్యసాయి జిల్లా గోరంట్ల మండలానికి చెందిన బాధితులు.. బెంగళూరులో కూలీలుగా పనిచేస్తున్నట్టు గుర్తించారు. దసరా పండుగ కోసం ఊరికి వచ్చి తిరుగు ప్రయాణంలో వెళ్తుండగా ప్రమాదం జరిగింది. మరణించిన వారిలో ఓ చిన్నారి, ముగ్గురు మహిళలు, 9 మంది పురుషులు ఉన్నారు. మృతులు ఆంధ్రప్రదేశ్ నుంచి వస్తున్నారని సంఘటనా స్థలాన్ని సందర్శించిన ఎస్పీ చెప్పారు. ఓ మహిళ పరిస్థితి ఆందోళనకరంగా ఉన్నట్టు సమాచారం.

లారీ కిందికి టాటా సుమో ముందు భాగం చొచ్చుకెళ్లింది. లోపలి చిక్కుకున్న వాహనాన్ని బయటకు తీయడానికి తీవ్రంగా శ్రమించిన పోలీసులు. క్రేన్ సాయంతో వెనక్కి లాగారు. బాధితులు లోపల ఇరుక్కుపోవడంతో కట్టర్ సాయంతో తొలగించి, మృతదేహాలను బయటకు తీశారు.

Tags

Read MoreRead Less
Next Story